/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ongole.jpg)
Prakasam: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పర్యటించారు. పుల్లల చెరువు మండలంలోని ముటుకులలో ఉన్న సమ్మర్ స్టోరేజీ వాటర్ ట్యాంకును ఆమె పరిశీలించారు. అక్కడ నుండి జరిగే నీటి సరఫరా విధానంపై ఆరా తీశారు. మండలంలోని 23 గ్రామాలకు ఇదే ప్రధాన నీటి వనరుగా అధికారులు వివరించారు. గ్రామస్తులు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.