Jagan: షర్మిల, సునీత నాపై పోటీకి దిగడానికి కారణం ఇదే: జగన్

కడప జిల్లా ప్రొద్దుటూరులో జగన్ సిద్ధం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కుట్రలు కుంతత్రాలు, మోసం చెయ్యడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు. ఇద్దరి చెల్లమ్మలను తన పైనే దాడికి పంపుతున్నాడని మండిపడ్డారు.

New Update
Jagan: షర్మిల, సునీత నాపై పోటీకి దిగడానికి కారణం ఇదే: జగన్

CM Jagan: కడప జిల్లా ప్రొద్దుటూరులో జగన్ సిద్ధం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అవలీలగా కుట్రలు చేసే కూటమి సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. కుట్రలు కుంతత్రాలు, మోసం చెయ్యడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు.

Also read: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ విడుదల.. వారికి నో ఛాన్స్!

14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని..కుటుంబంలో సైతం చీలికలు తెచ్చే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి చెల్లమ్మలను తన పైనే దాడికి పంపుతున్నాడని ఆరోపించారు. నన్ను ఓడించేందుకు మన కుటుంబంలోని వారినే ఉసిగోలిపారన్నారు. సొంత చెల్లమ్మలను సైతం నన్ను ఓడించెందుకు వాడుకుంటారని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు తన ఒదిన పేరిట బ్రేజిల్ నుంచి విజయవాడకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడితే మన బ్రదర్స్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏమీ జరిగిన నెపం తనపై నెట్టెందుకు దత్తపుత్రుడు, చంద్రబాబు సిద్ధంగా వుంటారని మండిపడ్డారు. జగన్ అంటే భయం కాబట్టే కూటమి పెట్టుకున్నారన్నారు. ఒంటరిగా వచ్చే ధైర్యం లేదంటే దేవుడు దయ, కోట్ల మంది అభిమానమేనన్నారు.

Advertisment
తాజా కథనాలు