Telangana Elections 2023: వాల్మీకి బోయలను ఎస్టీలుగా మార్చేదాక కేంద్రంతో కొట్లాడుడే: సీఎం కేసీఆర్..!!

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు సీఎం కేసీఆర్. మళ్లీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటుంది అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనుల్లో కలిపేంతవరకు కేంద్రంతో కొట్లాడుదామన్నారు.

New Update
CM KCR: ఉద్యమకారులను కాంగ్రెస్ కాల్చి చంపింది.. కేసీఆర్ మండిపాటు!

ఇందిరమ్మ రాజ్యంలో అంతా ఆకలి బతుకులే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. మళ్లీ ఇందరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ తెస్తానంటుందని విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో రౌడీలు, గుండాలు గెలవకూడదన్న కేసీఆర్...ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో అడ్డుకోవాలన్నారు. వలసల ప్రాంతంగా ఉన్న పాలమూరు పరిస్థితి మార్చింది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాల్మీకి బోయలను బీసీల్లో కలిపిందన్న సీఎం కేసీఆర్ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీక బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే అన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేంత వరకు ఆకలి బతుకులే ఉన్నాయని అన్నారు.

తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్సే:
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు చేసిన అన్యాయాలను సరిచేస్తున్నామన్నారు. ఆర్డీఎస్ కాలువల్లో పూడికతీత పనులకు రూ. 13కోట్లు మంజూరు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. పాలమూరులో కరువు రాకుండా చూసే బాధ్యతతనదే అన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ. 200 ఉండే పింఛన్ నురూ. 2వేలు చేశామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ ను దశలవారీగా రూ. 5వేలకు పెంచుతామని సీఎం తెలిపారు. 3గంటల కరెంట్ చాలని రైతు బంధు దండగా అని కాంగ్రెస్ నేతలుఅంటున్నారని సీఎం మండిపడ్డారు. కాంగ్రెసొళ్లు తెలంగాణను ఆగం చేసిండ్రని తెలంగాణ బతుకును గుగ్గిపాలు చేశారని తీవ్ర స్ధాయిలో ఆగ్రహంవ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అన్యాయాలను తాము సరిదిద్దుతున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పుట్టినపార్టీ అన్నారు.

ఈసారి కేంద్రం మెడలు వంచుడే:
ఆర్డీఎస్ పై నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలతో 35వేల ఎకరాలకు నీరు అందించామని సీఎం కేసీఆర్ అన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ కట్టుకుందామని ఈ సందర్భంగా తెలిపారు. చిన్నోనిపల్లి, నెట్టెంపాడు, పూర్తి చేస్తామని తెలిపారు. రాయలసీమ నాయకులు ఆర్డీఎస్ నుంచి అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే అప్పటి కాంగ్రెస్ ఆపే ప్రయత్నం చేయలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పదవులు వస్తే స్వార్థానికి వాడుకున్నారు కానీ ఒక్క మంచి పనిచేయలేదన్నారు. బోయలను బీసీల్లో కలిపి వారికి అన్యాయం చేసిందని కాంగ్రెస్ అంటూఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ బోయలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మాం చేసి కేంద్రానికి పంపిద్దామన్నారు. ఆ తీర్మానంపై కేంద్రం స్పందించలేకుటే ఈసారి కేంద్రం మెడలు వంచుడే అన్నారు. వాల్మీక బోయలను ఎస్టీలుగా మార్చేదాకా పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన బాబుమోహన్ కొడుకు..

Advertisment
తాజా కథనాలు