YS Jagan: కుట్రలు చేస్తారు.. కుటుంబాలను చీలుస్తారు: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు కుటుంబాలను చీల్చుతాయి.. కుట్రలు చేస్తాయని సీఎం జగన్ ఈ రోజు కాకినాడలో జరిగిన సమావేశంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ కానున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

New Update
YS Jagan: కుట్రలు చేస్తారు.. కుటుంబాలను చీలుస్తారు: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ లో చేరడం ఖాయమైన నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్ (AP CM Jagan) ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు రాబోయే రోజుల్లో మరిన్ని పొత్తులు పెట్టుకుంటారన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలను చేస్తారని నిప్పులు చెరిగారు. కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈ రోజు కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని జగన్ (CM Jagan) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న మరిన్ని కుట్రలు జరుగుతాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. తనకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదని టీడీపీ, జనసేన నేతలపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తాను ప్రజలనే నమ్ముకున్నానన్నారు.
ఇది కూడా చదవండి: AP Politics: షర్మిలతో పాటు జగన్ ఇంటికి వెళ్తున్నా.. కాంగ్రెస్ లో కూడా చేరుతున్నా: ఎమ్మెల్యే ఆర్కే

ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ నేడు వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కలిసి ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. ఆ హామీలను అమలు చేయని చంద్రబాబును జగన్ ఏనాడూ ప్రశ్నించలేదని ఫైర్ అయ్యారు. అవినీతి చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబు పవన్ కల్యాణ్ జైలుకు వెళ్లి పరామర్శించాడన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు