Yogi Vemana Jayanthi : యోగి వేమన పద్యం జన జీవన స్రవంతిలో ఓ భాగం.విశ్వదాభిరామ వినురవేమ" వేమన మకుటం తెలుగు వాళ్ళందరికీ కంఠోపాఠం. వేమన పద్యం తెలుగు నోట అంతలా కీర్తింపబడుతోందటే ఆయన వాక్కులో అంతటి వాస్తవాలున్నాయి. సమాజంలో ఎన్నో రుగ్మతలకు తన పద్యాలతో చీల్చి చెండాడిన సంఘసంస్కర్త యోగి వేమన ఇంతటి మహోన్నత ప్రజాకవి వేమన జయంతి జనవరి 19.
వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఏపీ సిఎం జగన్
యోగి వేమనను ప్రతీ ఒక్కరూ స్మరించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగి వేమన జయంతిని (Yogi Vemana Jayanthi )ఏటా (Jan19) జనవరి 19వ తేదీన అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి.. ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో వేమన జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ( YS JAGAN )వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
వేమన పద్యాలను వెలుగులోకి తెచ్చిన సీపీ బ్రౌన్
పామరులకు సైతం అర్ధమయ్యే అలతి అలతి పదాలతో వేమన రాసిన శతకం సమాజానికి నిలువుటద్దం. తన ఆశు కవిత్వంతో చిన్నపిల్లలకు సైతం అర్ధమయ్యే విధంగా చిన్నచిన్న పదాలతో రాసిన శతకంలో ప్రతిపద్యానికి చివర వాక్యం‘విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో రాయడం జరిగింది.వేమన జీవించిన కాలానికి సంబంధించి కూడా రకరకాల పరిశోదనలు జరిగాయి. 1652 - 1730 మధ్య కాలంలో అని కొంతమంది , 1367 - 1478 మధ్య కాలములోజీవించినట్లు కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా సీపీ బ్రౌన్ ద్వారా జనబాహుళ్యంలోకి వచ్చాయి.వేమన జయంతి సందర్బంగా ప్రధాని మోడీ వేమన గొప్పతనం గురించి పోస్ట్ చేయడం కూడా జరిగింది.
ప్రధాని మోడీ ట్వీట్
వేమన జయంతి సందర్భంగా ఈ రోజు మహాయోగి వేమన గారు పంచిన అపూర్వమైన జ్ఞానాన్ని స్మరించుకుందాం. అతని పద్యాలు, లోతైన బోధనలు మనలను సత్యం, సరళత, మనశ్శాంతితో కూడిన జీవితం వైపు నడిపిస్తూ జ్ఞానోదయాన్నీ స్ఫూర్తిననీ కలిగిస్తూ ఉన్నాయి. అతని సునిశితమైన రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ, అతని…
— Narendra Modi (@narendramodi) January 19, 2024
వేమన చరిత్రపై భిన్న పరిశోధనలు
ఇంతవరకు వేమన కులం ఏంటి అనేది ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఆయినా కులం గురించి ఇప్పటికీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ .. వాస్తవం ఏంటి అనే సంద్దిగ్దత ఇప్పటికీ ఉంది. కులమత బేధాలను నిరసించిన వేమన కులం చరిత్ర తెలుసకొనటానికే అయినా, పరిశోధకులు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. వేమన బ్రాహ్మణుడు కాదు కాపు(రైతు) అని బ్రౌన్ మొదట్లో భావించినా తరువాత జంగం కులానికి చెందినట్లు గుర్తించారు. అయితే .. రెడ్డి కులానికి, కాపు అనే కులానికి చెందినట్లు ఆయన పద్యాలను బట్టి కొందరు భావించడం కూడా జరిగింది. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందినవారు అని, కొండవీడు రెడ్డి రాజుల వంశానికి చెందినవారు అని, ఇంకొక పరిశోధన ప్రకారం గుంటూరు జిల్లా లోని కొండవీడు రెడ్డి రాజుల వంశంలో మూడో వారు వేమారెడ్డి అని అంటూ ఉంటారు. అయితే పరిశోధనల ప్రకారం.. ఆయన పద్యాల్లో ఉన్న పదాలు పచ్చ, దుడ్డుట, బిత్తలి లాంటి మాండలికాలను బట్టి రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలోనున్నందున, రాయలసీమకు చెందిన వ్యక్తి అని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. ఇంతటి మహోన్నత వ్యక్తి పేరుతో మన దేశంలో యోగివేమన విశ్వవిద్యాలయం నెలకొల్పడం. ఇది ఏకైక విశ్వవిద్యాలయం కావడం వేమనకు నిజమైన నివాళి. వేమన చరితం.. చరిత్ర పుటల్లో సువర్ణ లిఖితం.
ALSO READ: మీ ఇంటి మెయిన్ గేటు ముందు ఇవి ఉన్నాయా ? ఇకనైనా జాగ్రత్త పడండి!!