/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jagan-1-1-jpg.webp)
CM Jagan Memantha Siddham: 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రారంభం కానుంది. సీఎం జగన్ ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు.
Also Read: అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. అభ్యర్థి మార్పుపై ఆందోళన..!
ఆ తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
Memantha Siddham Yatra - Day 2.
జగనన్న మేమంతా సిద్ధం యాత్ర ఈరోజు షెడ్యూల్ ఇదే!
ఉదయం ఆళ్లగడ్డలో ప్రజలతో ఇంటరాక్ట్.. సాయంత్రం నంద్యాలలో సభ.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFanpic.twitter.com/hdEKiPoKzx
— YSR Congress Party (@YSRCParty) March 28, 2024