మరోసారి ఉదారత చాటుకున్న జగన్!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ గ్రామీణ పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు మరోసారి ఆర్థిక భరోసా అందించారు. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అమెరికాలో ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు.

New Update
మరోసారి ఉదారత చాటుకున్న జగన్!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ గ్రామీణ పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు మరోసారి ఆర్థిక భరోసా అందించారు. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అమెరికాలో ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె అమెరికాకు వెళ్లాలా వద్దా అనే డైలామాలో ఉన్నారు.

ఈ క్రమంలో ఆమెకు అవసరం అయిన ఆర్థిక సాయం చేయాలన్న విజ్ఙప్తులు ఏపీ ప్రభుత్వానికి వచ్చాయి. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన జాహ్నవికి భరోసా ఇచ్చారు. పోలవరం బాధితుల పరామర్శల కోసం ఏలూరు వచ్చిన సీఎం జగన్‌ను జాహ్నవి దంగేటి కలిశారు. అమెరికాలో శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు.

జాహ్నవి విజ్ఞప్తికి ముఖ్యమంత్రికి సానుకూలంగా స్పందించిన సీఎం ట్రైనింగ్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జాహ్నవి ఇప్పటికే ఏవియేషన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ ట్రైనింగ్ కు కూడా ఏపీ ప్రభుత్వమే సాయం చేసింది. ఏవియేషన్ పైలట్ కావడం తన లక్ష్యమని ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో.. జాహ్నవి ఏవియేషన్‌ శిక్షణకు రూ. 50 లక్షల సాయం అందజేసిన ఏపీ ప్రభుత్వం.

నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు జాహ్నవి దంగేటి. 2021 నవంబరులో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కు జాహ్నవి ఎంపికయ్యారు. అంతరిక్షానికి సంబంధించిన ప్రాథమిక అవగాహనపై శిక్షణ పొందారు. తర్వాత పోలండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌కు ఎంపికై, విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు.

2021 నవంబర్‌ 12న అమెరికాకు వెళ్లి నాసాకు చెందిన స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సైన్స్‌ సెంటర్‌లో ఆస్ట్రోనాట్‌ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. పది రోజుల్లో జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్, అండర్‌ వాటర్‌ రాకెట్‌ లాంచ్‌ చేయడంతో పాటు ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకున్నారు. మూన్ సిమ్యులేటర్‌పై శిక్షణ పొందారు.

జాహ్నవి అస్ట్రోనాట్ గా చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి ఇండియన్ అని అనిపించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. జాహ్నవి సాధించిన విజయాలు .. భారత యువతలో అంతరిక్ష రంగంలో మరింత ఎక్కువ మంది ఆసక్తి చూపించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు