Champion OTT: ఓటీటీలోకి యంగ్ హీరో రోషన్ మేకా 'చాంపియన్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

రోషన్ మేకా పీరియాడ్ యాక్షన్ డ్రామా చాంపియన్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రజాకార్ వ్యవస్థ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు భాషల్లో అందుబాటులో ఉంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు సాధించినప్పటికీ, రోషన్ నటనకు మంచి స్పందన వచ్చింది.

New Update
Champion OTT

Champion OTT

Champion OTT: టాలీవుడ్ యంగ్ హీరో  రోషన్ మేకా(Roshan Meka) నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా చాంపియన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నిజాం పాలన కాలంలో ఉన్న రజాకార్ వ్యవస్థను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా మలయాళ నటి అనశ్వర రాజన్ నటించింది.

చాంపియన్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. థియేటర్ రిలీజ్ తర్వాత సుమారు ఐదు వారాలకే ఓటీటీలోకి వచ్చింది. అయితే హిందీ వెర్షన్‌పై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్లపై ప్రియాంకా దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ కలిసి నిర్మించగా, జీ స్టూడియోస్ ప్రెజెంట్ చేసింది. నందమూరి కళ్యాణ చక్రవర్తి, మురళీ శర్మ, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించారు.

2025 డిసెంబర్‌లో విడుదలైన చాంపియన్ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹17 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో నెట్ కలెక్షన్స్ సుమారు ₹12.40 కోట్లుగా నమోదయ్యాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹11.5 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ బాగానే ఉన్నా, తొలి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గాయి. రోషన్ నటనకు మంచి స్పందన వచ్చినప్పటికీ, బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేక సినిమా నష్టాలు చవి చూసింది.

Advertisment
తాజా కథనాలు