/rtv/media/media_files/2025/10/28/yash-toxic-2025-10-28-17-00-28.jpg)
yash toxic
Yash Toxic: 'కేజేఎఫ్' బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ 'టాక్సిక్' పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా వచ్చే ఏడాది (2026) ఉగాది కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. కానీ, నిర్మాణంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మళ్ళీ వాయిదా?
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మేకింగ్ స్టైల్ యష్ మాస్ ఇమేజ్ కి సరిపోవడం లేదట. ఈ కారణంతోనే సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గీతూ మోహన్ సినిమాల్లోని పాత్రలు చాలా సెన్స్ బుల్ అండ్, సాఫ్ట్ గా కనిపిస్తుంటాయి. దీంతో ఆమె మేకింగ్ స్టైల్ యష్ ఇమేజ్ కి మ్యాచ్ అవ్వడం లేదని సినీ వర్గాల్లో టాక్. హీరో యష్ కూడా సినిమాలోని కొన్ని సన్నివేశాల అవుట్ పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారట. దీంతో యష్ ఫాలోయింగ్, మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. సినిమాలో మరింత మాస్ అండ్ కమర్షియల్ ఎలిమినేట్స్ చేర్చడానికి మార్పులు చేస్తున్నారట.
Kannada Superstar #Yash’s #Toxic is in the final stages of completion and tentatively set for March 2026 release.
— Rangasthalam (@RangasthalamIN) October 26, 2025
However, with no teaser or poster out yet, fans are growing anxious that the release might get pushed.
It’s high time the #ToxicTheMovie team wakes up and gives an… pic.twitter.com/gyvaxojj9j
మరో వైపు టాక్సిక్ విడుదల పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని.. అవి కేవలం పుకార్లేననే ప్రచారం కూడా జరుగుతోంది. యష్ టాక్సిక్ షూటింగ్ చివరి దశకు చేరుకుందని.. మార్చి 2026లో విడుదలకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు.
Follow Us