/rtv/media/media_files/2024/10/20/baby3.jpeg)
చలికాలంలో పిల్లల ఆరోగ్యం, చర్మ సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారికి పెట్టే ఆహారం నుంచి ధరింపజేసే దుస్తువుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చలికాలంలో నవజాత శిశువులకు స్నానం చేయించేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
/rtv/media/media_files/2024/11/21/M8T4oPquOOFlLjBTPCwG.jpg)
చలికాలంలో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటి ఉష్ణోగ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలకు ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. చాలా వేడి, చాలా చల్లని నీళ్లను వాడకూడదు.
/rtv/media/media_files/2024/11/21/babybath31.jpeg)
పిల్లలకు స్నానం చేయించిన తర్వాత.. వారిని వెచ్చగా ఉంచడం చాలా ముఖ్యం. లేదంటే పిల్లలకు జలుబు, జ్వరం వచ్చే ప్రమాదం ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/21/babybath41.jpeg)
అలాగే స్నానం చేయించిన తర్వాత కాసేపు ఎండలో ఉంచడం కూడా మంచిది. విపరీతమైన ఎండలో అస్సలు ఉంచకూడదు. ఉదయాన్నే 6 నుంచి 7 గంటల్లో వచ్చే ఎండలో మాత్రమే ఉంచాలి.
/rtv/media/media_files/2024/11/21/babybath21.jpeg)
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయించడం వల్ల.. కొన్ని సందర్భాల్లో పిల్లల చర్మం పొడిబారడం, దద్దుర్లు రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్మ సమస్యలను నివారించడానికి పిల్లల స్నానానికి ఉపయోగించే నీటిలో రెండు-మూడు చుక్కల కొబ్బరి లేదా ఆవాల నూనె వేయాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
/rtv/media/media_files/2024/11/21/babybath91.jpeg)
చల్లని వాతావరణంలో పిల్లలకు స్నానం చేయించేముందు.. గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. ఇది పిల్లలకు వెచ్చదనాన్ని అందిస్తుంది. ఉదయాన్నే సూర్యరశ్మిలో మసాజ్ చేయడం మరీ మంచిది.
/rtv/media/media_files/2024/11/21/babybath111.jpeg)
చలికాలంలో ప్రతీరోజు పిల్లలకు స్నానం చేయించాల్సిన అవసరం లేదు. వారంలో రెండు లేదా మూడు సార్లు చేయించవచ్చు. ఒకవేళ రోజూ స్నానం చేయించాలనుకుంటే వెట్ వైప్స్ లేదా తడి గుడ్డతో పిల్లవాడిని శుభ్రం చేయవచ్చు.
/rtv/media/media_files/2024/11/21/babybath101.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.