/rtv/media/media_files/2026/02/04/sharwanand-2026-02-04-07-29-42.jpg)
Sharwanand
Sharwanand: శర్వానంద్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా నారి నారి నడుమ మురారి థియేటర్లలో మంచి విజయం సాధించింది. సంక్రాంతి సీజన్‌లో భారీ పోటీ ఉన్నా కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సమాజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.
Naari Naari Naduma Murari OTT
ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియో OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ కూడా ఉండటం విశేషం. థియేటర్ విడుదలైన కేవలం మూడు వారాలకే OTTలోకి రావడం ప్రేక్షకులకు మంచి సర్ప్రైజ్‌గా మారింది.
ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్తా, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. అలాగే సునీల్, నరేష్ విజయకృష్ణ, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించగా, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకరించింది. సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. థియేటర్లలో చూడలేకపోయినవారు ఇప్పుడు ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.
Follow Us