Vishwak Sen Funky: విశ్వక్ సేన్ ‘ఫంకీ’కి షాకింగ్ ఓపెనింగ్స్.. తొలి రోజే నిరాశ!

విశ్వక్ సేన్ “ఫంకీ” వాలెంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైంది. మంచి అంచనాలు ఉన్నా మొదటి రోజే నిరాశపరిచింది. మెయిన్ థియేటర్స్ లో కూడా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. ప్రమోషన్స్ తక్కువగా ఉండటం బాక్సాఫీస్‌పై ప్రభావం చూపింది.

New Update
Vishwak Sen Funky

Vishwak Sen Funky

Vishwak Sen Funky: విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “ఫంకీ” ఫిబ్రవరి 13, 2026న వాలెంటైన్స్ డే వీకెండ్ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. కుటుంబ కథతో పాటు ప్రేమ, కామెడీ కలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. కాయాదు లోహార్ హీరోయిన్‌గా నటించగా, నరేష్, వీవీటి గణేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

సంక్రాంతి సీజన్ తరువాత వచ్చిన సినిమా కావడంతో “ఫంకీ”పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్‌కు యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో, మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించారు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించలేదు.

మెయిన్ థియేటర్స్ లో అయినా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తాయని మూవీ టీమ్ అనుకున్నారు. కానీ చాలా చోట్ల ఆక్యుపెన్సీ తక్కువగానే ఉంది. విడుదలకు ముందు చేసిన ప్రచారం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని ఓపెనింగ్స్ చూస్తే తెలుస్తోంది. సాధారణంగా విశ్వక్ సేన్ సినిమాలకు మొదటి రోజు మంచి కలెక్షన్లు వస్తాయి. గతంలో ఫ్లాప్ అయిన సినిమాలకూ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ “ఫంకీ” ఆ విషయంలో కూడా నిరాశపరిచింది.

సినిమా పాటలు మరింత ఆకట్టుకునేలా ఉంటే పరిస్థితి మారేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. విమర్శకుల నుండి వచ్చిన మిక్స్డ్ టాక్, ప్రేక్షకుల మౌత్ టాక్ కూడా బాక్సాఫీస్‌పై ప్రభావం చూపింది. ఫిబ్రవరి నెలలో సాధారణంగా సినిమాలకు పెద్ద పోటీ ఉండదు. అలాంటి సమయంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లకు ఊపిరి పోస్తుందని అనుకున్నారు. కానీ కథనం, పెర్ఫార్మన్స్ యావరేజ్ గా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సినిమా రూపొందింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నరేష్ విజయకృష్ణ, ఈశ్వరి రావు, సంపత్ రాజ్, జయకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మొత్తానికి, మంచి అంచనాలతో వచ్చిన “ఫంకీ” ప్రారంభంలోనే నిరాశపరిచింది. ఇక వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు