వేసవికి వచ్చేస్తున్న మంచు విష్ణు 'కన్నప్ప'..రిలీజ్ డేట్ ఇదే..?

మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update

Kannappa: హీరో మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, నయనతార, ముఖేష్ రిషీ, సంపత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. 

వేసవికి 'కన్నప్ప'

అయితే తాజాగా మేకర్స్ ఈ కన్నప్ప విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఇలా మంచి డేట్ ను లాక్ చేశారు మేకర్స్. గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు 'కన్నప్ప' హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో  పాన్ ఇండియా లెవెల్లో నటుల్ని తీసుకున్నాడు.

Also Read: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి

Advertisment
Advertisment
తాజా కథనాలు