/rtv/media/media_files/2025/03/13/gFwYNEgh9uBa1L6JKRZh.jpg)
Bhadrakali teaser
Vijay Antony Bhadrakali: "బిచ్చగాడు" సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో హీరో విజయ్ ఆంటోనీ, మ్యూజిక్ డైరెక్టర్ గా, దర్శకుడిగా, నటుడుగా, మల్టీ టాలెంట్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు.తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన 25వ సినిమా టీజర్ విడుదలైంది.
"అరువి", "వాళ్" వంటి వినూత్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పేరును తెలుగులో "భద్రకాళి" గా పెట్టారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ లో కథతో పాటుగా విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
పొలిటికల్ స్టోరీ తో ప్రత్యేకించి 197 కోట్ల రూపాయల స్కామ్ గురించి జరిగే కధను దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ చాలా విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. గ్యాంగ్ స్టర్, మోసగాడు, ఫ్యామిలీ మ్యాన్, ప్రభుత్వ అధికారి, ఖైదీ ఇలా చాలా గెటప్స్ లో కనిపించరు విజయ్ ఆంటోనీ. రిలీజ్ అయినా టీజర్ కు మంచి స్పందన వస్తోంది. వేసవి కానుకగా, ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.