Varun Tej Son: మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ కొడుకు చాలా స్పెషల్.. ఆ రికార్డు ఈ బుడ్డోడికే సొంతం!

మెగా ఫ్యామిలీలోకి మూడో తరం వారసుడు వచ్చేశాడు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట  ఈరోజు ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ కొడుకు చాలా స్పెషల్!

New Update
Varun Tej Son

Varun Tej Son

Varun Tej Son: మెగా ఫ్యామిలీలోకి మూడో తరం వారసుడు వచ్చేశాడు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట  ఈరోజు ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ కొడుకు చాలా స్పెషల్ కాబోతున్నాడు! ఎందుకంటే.. కొణిదెల మూడో తరంలో  పుట్టిన మొదటి మగ బిడ్డ వరుణ్ కొడుకు. చిరంజీవి సంతానం రామ్ చరణ్, శ్రీజ, సుష్మిత ముగ్గురికి కూడా ఆడపిల్లలే జన్మించారు. దీంతో మెగా ఫ్యామిలీ ఒక బుజ్జి  వారసుడి కోసం ఎదురుచూస్తూ ఉంది. ఈ తరుణంలో వరుణ్ కొడుకు రాక కుటుంబంలో సంతోషాల్ని తెచ్చింది. అంతేకాదు  కొణిదెల ఫస్ట్ జనరేషన్  మొదటి మగ బిడ్డగా చిరంజీవి , సెకండ్ జనరేషన్ లో రామ్ చరణ్, ఇప్పుడు ఆ అదృష్టం వరుణ్ కొడుక్కి దక్కింది.

చాలా స్పెషల్ 

నెక్స్ట్ ఫ్యూచర్ లో రామ్ చరణ్, అఖీరాకు కూడా మగ పిల్లలు పుట్టొచ్చు. కానీ, ఈ తరం మొదటి మగబిడ్డగా వరుణ్ కొడుకు చాలా ప్రత్యేకమైనవాడిగా ఉండబోతున్నాడు. మెగా ఫ్యామిలీ లెగసీని కొనసాగించే ఈ వారసుడి రాకతో అటు అభిమానులు, ఇటు మెగా కుటుంబం  సంతోషంలో మునిగితేలుతున్నారు.  మెగాస్టార్ చిరంజీవి కూడా వారసుడు పుట్టాడని తెలియడంతో ఆనందంతో పరుగుపరుగున హాస్పిటల్ కి వెళ్లి బాబును చూశారు. బుల్లి మెగా ప్రిన్స్ ని ఎత్తుకొని ముద్దాడారు.  అంతేకాదు బాబుకు వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 

మెగాస్టార్ పోస్ట్ 

 ''ప్రపంచానికి స్వాగతం మై లిటిల్ వన్ ! కొణిదెల కుటుంబంలో  అడుగుపెట్టిన మరో బుజ్జి బాబుకి  స్వాగతం. ప్రౌడ్ పేరెంట్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠికి హృదయపూర్వక అభినందనలు. గ్రాండ్ పేరెంట్స్ గా మారిన  నాగబాబు, పద్మజకు శుభాకాంక్షలు. మా బుజ్జి బాబుకు మంచి ఆరోగ్యం, సంతోషాలు, అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ,  ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డ చుట్టూ ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ మెగాస్టార్ పోస్ట్ పెట్టారు. 

Advertisment
తాజా కథనాలు