ఎన్నో ఏళ్ల నుంచి ఈ రోజు కోసం.. రేణు దేశాయ్ కి ఉపాసన ఏం చేసిందో తెలుసా

రామ్ చరణ్ భార్య ఉపాసన రేణుదేశాయ్ స్థాపించిన యానిమల్ ఎన్జీవో కోసం అంబులెన్స్‌ కొనుగోలు చేయడంలో తన వంతు సహాయం చేశారు. తమ పెంపుడు జంతువు రైమ్ పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు.

upasana

upasana

New Update

upasana: ఎన్నో ఏళ్ల తన కల నెరవేరింది అంటూ నటి రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే రేణు దేశాయ్ కు మూగ జీవాల కోసం ఒక NGO ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చిన్నతనం నుంచే  మూగజీవాలు అంటే ఇష్టం ఉండడంతో... వాటి సంరక్షణ కోసం ఏదైనా చేయాలని కోవిడ్ సమయంలో తన సొంత NGO ను రిజిస్టర్‌ చేయించారు. 

Also Read:  దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి

రేణుదేశాయ్ కి ఉపాసన సహాయం 

ఈ నేపథ్యంలో ఆమె స్థాపించిన  ‘శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌’ కోసం అంబులెన్స్  కొనుగోలు చేయడానికి ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని ఇన్స్టా లో పోస్ట్ చేసింది. దీనికి రామ్ చరణ్ భార్య ఉపాసన తన వంతు సహాయం చేసింది. తన పెంపుడు జంతువు రైమ్ పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ''అంబులెన్స్‌ కొనుగోలుకు విరాళం అందించిన ఉపాసన , రైమీకి ధన్యవాదాలు'' అని తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉపాసన మంచితనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్నతనం నుంచే రేణుదేశాయ్ కి మూగజీవాలు అంటే చాలా ఇష్టం. వాటి సంరక్షణ కోసం ఏదైనా చేయాలని కోవిడ్ సమయంలో తన సొంత NGO ను రిజిస్టర్‌ చేయించారు. 

రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా తక్కువ సినిమాలు చేసిన రేణు కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. రీసెంట్ గా రవితేజ టైగర్ నాగేశ్వర్ సినిమాతో మళ్ళీ వెండి తెరపై కనిపించారు. రేణుదేశాయ్ కి కూతురు ఆధ్య, కొడుకు అకీరా ఉన్నారు. 

Also Read: పుష్ప2 క్రేజ్.. ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్.. RRR రికార్డ్స్ బ్రేక్

renu

Also Read:  అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe