దుమ్మురేపిన ఉపేంద్ర.. UI ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తర్వాత 'UI' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించాడని ఆడియెన్స్ అంటున్నారు.

New Update

UI The Movie: దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తర్వాత 'UI'  కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర  'UI' ది మూవీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు పలు భాషల్లో  విడుదలైన ఈ చిత్రానికి  అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూలతో ట్రెండ్ అవుతోంది. సినిమాలో హీరోగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించాడని ఆడియన్స్ అంటున్నారు. మరి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మూవీ సూపర్ హిట్, మైండ్ బ్లోయింగ్ అంటూ చెబుతున్నారు. సినిమాలో డ్రా బ్యాక్స్ అని చెప్పడానికి ఏమీ లేవు. ఫ్యామిలీతో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు అని అంటున్నారు. 

ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఉపేంద్ర మైండ్ గేమ్ నెక్స్ట్ లెవెల్. సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన చేశారు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ ఇరగదీశారు అంటూ రివ్యూ చెప్పాడు. 

సినిమా ఓపెనింగ్ లో  "If you are intelligent get out of the theatre right now"అంటూ టైటిల్స్ వేయడం వింటేజ్ ఉపేంద్రను గుర్తుచేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదొక అద్భుతమైన సినిమా! ఖచ్చితంగా ఉత్కంఠభరితమైన కళాఖండం! అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు 

మరో నెటిజన్.. రొటీన్ సినిమాలు వస్తున్న వేళ.. ప్రస్తుతం ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ సమస్యలను హార్ట్ హిట్టింగ్ గా తెరకెక్కించారు ఉపేంద్ర అని రాసుకొచ్చాడు. 

మరో నెటిజన్.. ఫస్ట్ హాఫ్ కొంత గందరగోళంగా ఉంది. సెకండ్ హాఫ్ గుడ్.. క్లైమాక్ అదిరిపోయింది. బీజీఎమ్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ యావరేజ్ అని ట్వీట్ చేశాడు. దీనికి రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ సినిమా అదిరిపోయిందంటూ దీనికి 2.75/5 ఇవ్వొచ్చని అంటున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు