/rtv/media/media_files/2026/01/23/constable-kanakam-2026-01-23-08-03-04.jpg)
Constable Kanakam
Constable Kanakam: ఈటీవీ విన్‌లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన చాప్టర్ 2 మొదటి భాగాన్ని మించి మంచి రివ్యూలు పొందుతూ మంచి వ్యూయర్‌షిప్ నమోదు చేసింది.
Constable Kanakam Chapter 3 Glimpse
The story grows bigger.
— 🚩🇷🇴🇸🇸🇾ᵗʷᵉᵉᵗᶻ✍️ (@AmTheGalaxyy) January 22, 2026
The mystery gets deeper.
The experience goes larger than life. 🎥🔥
Presenting the glimpse of Constable Kanakam – Chapter 3, an A Win Original Production, coming soon to theatres. 🚔✨
Get ready for the next big chapter.pic.twitter.com/Hm5miONS51
Constable Kanakam Chapter 3 in Theaters
ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ఈ సిరీస్ మూడో భాగాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘కానిస్టేబుల్ కనకం: కాల్ ఘాట్ - చాప్టర్ 3’ అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా, కథపై ఆసక్తి మరింత పెరిగింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇప్పటి వరకు ఓటీటీలోనే చూసిన ఈ కథను ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికి వస్తారా? ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భర్గవ్, కంచెరపాలెం కిషోర్, జ్వాల కోటి, రాకెండు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కోవెలముడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మిస్తున్నారు.
కథ విషయానికి వస్తే, 1990ల కాలంలో శ్రీకాకుళం జిల్లా రేపల్లె ప్రాంతంలో జరుగుతుంది. అడవి గుట్ట అనే ఒక రహస్య ప్రదేశంలోకి వెళ్లిన మహిళలు కనిపించకుండా పోతుంటారు. ఈ ఘటనలు భయానకంగా మారుతాయి. తన స్నేహితురాలు చంద్రిక (మేఘ లేఖ) మాయమవడంతో, స్థానిక కానిస్టేబుల్ అయిన కనక మహాలక్ష్మి అలియాస్ కనకం (వర్ష బొల్లమ్మ) ఈ కేసును విచారించడం మొదలుపెడుతుంది.
విడుదలైన గ్లింప్స్‌లో కాల్ ఘాట్ అనే ప్రాంతాన్ని చాలా భయంకరంగా చూపించారు. అక్కడ మానవ రూపంలో ఉన్న రాక్షసుల కథ, ఆ ప్రాంతంలో జరిగే రహస్యాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. వెబ్‌సిరీస్‌కు మించిన స్థాయిలో, భారీగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
ఈసారి కనకం ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? ఆ రహస్యాలను ఆమె ఎలా ఛేదిస్తుంది? అన్నది థియేటర్లలోనే తెలుసుకోవాలి.
Follow Us