The Witch Revenge Horror Movie: థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారిని హారర్ జోనర్ సినిమాలు ఎప్పుడూ డిస్పాయింట్ చెయ్యవు. కొంతమంది అయితే భయపడుతూనే, కళ్లు మూసుకుంటూ అయినా సినిమాను చేసేస్తుంటారు. మరికొంతమంది కొత్త కొత్త హారర్ మూవీస్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను తెగ వెతికేస్తుంటారు. తాజాగా హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ కంటెంట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కొన్ని సినిమాలైతె ప్రేక్షకుల ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటున్నాయి.
అలాంటి హారర్ థ్రిల్లింగ్ మూవీస్ జాబితాలో తాజాగా “ది విచ్: రివెంజ్” చేరింది. ఈ చిత్రం భయం, ప్రతీకారం, మాయల మంత్రాల తో కూడిన ఓ ఫాంటసీ హారర్ డ్రామా. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తీసిన ఈ కథ ఒక మాంత్రికురాలి చుట్టూ తిరుగుతుంది.
కథేంటంటే?
ఈ హారర్ ఫాంటసీ కథలో ప్రధాన పాత్రలో ఉండే మంత్రగత్తె, రష్యన్ సైనికుల చేతిలో తన కాబోయే భర్తను కోల్పోతుంది. ఈ దుర్మార్గ ఘటన తర్వాత ఆమె వారి మీద తీవ్రమైన ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే - ఆమె సాధారణ ప్రజలపై కాకుండా సైనికులపై తన కోపాన్ని చూపుతుంది. వారిపై ఆమె ఏ విధంగా కక్ష తీర్చుకుంటుంది? ఎందుకు ఇలా చేస్తుంది? అన్నది అతి భయంకరంగా చూపించారు. భయాన్ని రేకెత్తించే సన్నివేశాలు, మిస్టికల్ మూమెంట్స్ సినిమాకు ప్రాణం పోస్తాయి. ప్రతీ సీన్‌కి ప్రేక్షకుడు త్రిల్ ఫీల్ అవుతాడు.
ఈ సినిమాకు ఆండ్రీ కొలెస్నిక్ దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత ఆండ్రజెజ్ సప్కోవ్స్కీ రచించిన పుస్తకాల ఆధారంగా ఈ కథను రూపొందించారు. 2024లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
జియో సినెమా / హాట్‌స్టార్ - హిందీ డబ్బింగ్‌లో అందుబాటులో ఉంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో - తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ తథ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే లా ఈ మూవీ రూపొందించారు. మాంత్రికత, యుద్ధ నేపథ్యం, రివెంజ్ కాంబినేషన్‌తో తెరకెక్కిన ఈ మోవీ “ది విచ్: రివెంజ్” ఓటీటీలో ది బెస్ట్ హారర్ అనుభవం ఇస్తుంది. మీరు హారర్ సినిమాల అభిమాని అయితే, దీన్ని ఒక్కసారైనా తప్పకుండా చుడండి, కానీ ఒంటరిగా కూర్చొని చూడకపోవడమే బెటర్!