Om Shanti Shanti Shantihi: ఆకట్టుకుంటున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్.. గోదారోళ్ల ఎటకారం మాములుగా లేదుగా..!

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన గ్రామీణ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ జనవరి 30న విడుదల కానుంది. ట్రైలర్ ఆకట్టుకునే భర్త-భార్య కామెడీతో అంచనాలు పెంచింది. కొత్త దర్శకుడు ఎ.ఆర్. సజీవ్ ఈ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

New Update
Om Shanti Shanti Shantihi

Om Shanti Shanti Shantihi

Om Shanti Shanti Shantihi Trailer

Om Shanti Shanti Shantihi: తరుణ్ భాస్కర్(Tharun Bhascker) - ఈషా రెబ్బ(Eesha Rebba) జంటగా నటిస్తున్న కొత్త విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండటంతో సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ వీడియోలు మంచి బజ్ తీసుకువచ్చాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అయితే ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. మొదటి నుంచి చివరి వరకు నవ్వులు పూయించేలా ట్రైలర్ సాగింది.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బల మధ్య వచ్చే భర్త-భార్య గొడవలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇద్దరి మధ్య ఉండే అహం, మాటల యుద్ధం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇద్దరూ తమ పాత్రల్లో సహజంగా నటించారు. తెలంగాణకు చెందినవారైనప్పటికీ, గోదావరి యాసలో చాలా సహజంగా మాట్లాడటం విశేషం. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ తన సహజ నటనతో మరోసారి ప్రశంసలు పొందుతున్నాడు.

ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఎ.ఆర్. సజీవ్ కథను చాలా బాగా నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కామెడీ బాగా వర్క్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూసేలా ఉండే వినోదాత్మక సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, ట్రైలర్ సినిమాపై మంచి నమ్మకం కలిగించింది. కొత్తగా కనిపిస్తున్న తరుణ్ - ఈషా జోడీ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగలదా? ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. జనవరి 30న విడుదలయ్యే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుందనే మూవీ టీమ్ నమ్మకంగా ఉంది..

Advertisment
తాజా కథనాలు