ఓటీటీలో దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

విజయ్ లేటెస్ట్ ఫిల్మ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.

New Update

The GOAT Ott:  తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తలపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ మాజీ నాయకుడు గాంధీ కథను 
నేపథ్యంలో సాగిన ప్రేక్షకులను విపరీతంగా  ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో విజయ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తే కొడుకుగా యంగ్ అండ్ స్టైలిష్ మేకోవర్ తో ఆకట్టుకున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభుదేవా, ప్రశాంత్, మోహన్, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, వైభవ్, యోగి బాబు, ప్రేమ్గి అమరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఓటీటీ రిలీజ్ 

తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.   నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏకంగా రూ. 125 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్స్ తో పోలిస్తే ఓటీటీలో ఈ మూవీ రన్ టైం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ వెర్షన్ కోసం కొన్ని సీన్లు యాడ్ చేయనున్నట్లు టాక్. 

Also Read:  కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో ఎన్టీఆర్, నాని

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe