Supergirl: ‘సూపర్ గర్ల్’ వచ్చేస్తోంది.. తెలుగు ట్రైలర్ చూశారా..?

హాలీవుడ్ సూపర్ హీరో కథలపై ఎన్నో సినిమాలొచ్చాయి. తాజాగా సూపర్ మ్యాన్ చెల్లెలి ‘సూపర్ గర్ల్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మిల్లీ ఆల్కాక్ ప్రధాన పాత్రలో యాక్షన్, ఫన్నీ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా 2026 జూన్ 26న అన్ని భాషల్లో విడుదల కానుంది.

New Update
Supergirl

Supergirl

Supergirl: ఇప్పటివరకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వంటి హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు మనం చూసి అలవాటైనాం. ఈ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇప్పుడు హాలీవుడ్ మాత్రమే కాకుండా, టాలీవుడ్ ప్రేక్షకులనూ ఆకట్టుకోవడానికి మరో సూపర్ హీరో కథ వస్తోంది. కానీ ఈసారి హీరో కాదు, హీరోయిన్ ప్రధాన పాత్రలో ఉంది. సూపర్ మ్యాన్ చెల్లెలి పేరుతో ‘సూపర్ గర్ల్’ సినిమా థియేటర్లకు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

Supergirl Telugu Trailer

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే, సూపర్ మ్యాన్ లాంటి ఫన్నీ మోమెంట్స్, జోక్స్ ఉన్నా, ఆపద వచ్చే సరికి తన సూపర్ పవర్స్‌ని ఉపయోగించి సమస్యలు పరిష్కరించే సూపర్ గర్ల్ పాత్రను మిల్లి ఆల్కాక్ అద్భుతంగా ప్రదర్శించింది. యాక్షన్ సీన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా చూపించారు.

ఈ సినిమాను డీసీ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. అనా నొగ్వేరా దర్శకత్వం వహించారు. సినిమా 2026 జూన్ 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇంగ్లీష్ తో పాటు తెలుగు, ఇతర ప్రాంతీయ భాషలలో కూడా విడుదల కానుంది.

ట్రైలర్ రిలీజ్‌తోనే సినిమాపై హైప్ మొదలైపోయింది. ప్రేక్షకులు ఫన్నీ, యాక్షన్, సూపర్ పవర్స్ అన్నీ కలసిన ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్, ప్రివ్యూ‌లు, ఇంటర్వ్యూలు రానున్నాయి.

సూపర్ గర్ల్ పాత్ర, యాక్షన్, ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా ద్వారా హాలీవుడ్ సూపర్ హీరో కథలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆస్వాదించే అవకాశం వచ్చింది. మరి ఈ ట్రైలర్ గురించి మీరు ఏమంటారు..?

Advertisment
తాజా కథనాలు