Actor Abhinay: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హీరో కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తమిళ నటుడు అభినయ్ కింగర్ అనారోగ్యంతో  కన్నుమూశాడు. గత కొద్దిరోజులుగా లివర్ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. అభినయ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 

New Update
actor abhinay

actor abhinay

Actor Abhinay: సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తమిళ నటుడు అభినయ్ కింగర్ అనారోగ్యంతో  కన్నుమూశాడు. గత కొద్దిరోజులుగా లివర్ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. అభినయ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా తమ ప్రార్థనలను తెలియజేస్తున్నారు. 

చనిపోతానని ముందే!

అయితే అభినయ్ తాను మరికొన్ని రోజుల్లో చనిపోతానని ముందే చెప్పడం  ఎంతో విషాదకరం. మూడు నెలల క్రితం ఓ తమిళ కమెడియన్  లివర్ వ్యాధితో బాధపడుతున్న అభినయ్ ని కలిసి రూ. 1 లక్ష ఆర్ధిక సహాయం అందించారు. ఈ సమయంలో అభినయ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. తనకు వైద్యులు ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని చెప్పారని, తాను ఎక్కువ బతకనని ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన మరణించడం అభిమానులను, సినీ తారలను విషాదంలో ముంచింది. అభినయ్ ఆర్ధిక సమస్యల నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను ఫిల్మ్ ఛాంబర్ ప్రకటిస్తుందని సమాచారం. 

అభినయ్ చివరిగా 2014లో విడుదలైన  'వల్లవణుక్కు పుళ్లుం ఆయుధం' అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమై ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే లివర్ వ్యాధితో బాగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. 

2002లో హీరోగా 

1981 చెన్నైలో జన్మించిన అభినయ్ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో పెరిగారు. ఆయన తల్లి టి.పి. రాధామణి కూడా తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. అభినయ్ 2002లో  'తుళ్లువదో ఇళమై' సినిమాతో  నటుడిగా ఇండస్ట్రీకి  పరిచయమయ్యారు. 'జంక్షన్' హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత  'సక్సెస్', 'పొన్ మేఘలై', 'సొల్ల సొల్ల ఇనిక్కుమ్', 'అరుముగం', 'ఆరోహణం' వంటి పలు తమిళ సినిమాల్లో కీలక పాత్రలు నటించి మంచి  గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read: Rajamouli vs Telugu Media: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌పై వివాదం! తెలుగు మీడియా కెమెరాలకు నో ఎంట్రీ!

Advertisment
తాజా కథనాలు