/rtv/media/media_files/2025/08/28/sv-krishna-reddy-pic-one-2025-08-28-20-36-29.jpeg)
ఈరోజు పూజ కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పూజ కార్యక్రమంలో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్, నిర్మాత దిల్ రాజు, నటుడు మురళీమోహన్ , ఆలీ తదితరులు పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/08/28/sv-krishna-reddy-pic-two-2025-08-28-20-36-29.jpeg)
ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
/rtv/media/media_files/2025/08/28/sv-krishna-reddy-pic-three-2025-08-28-20-36-29.jpeg)
అయితే ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో కొరియన్ నటి జున్ హ్యూన్ జీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
/rtv/media/media_files/2025/08/28/sv-krishna-reddy-pic-four-2025-08-28-20-36-29.jpeg)
జున్ హ్యూన్ మై సాసీ గర్ల్, విండ్స్ట్రక్, ది థీవ్స్, ది బెర్లిన్ ఫైల్, అసాసినేషన్ వంటి సినిమాలతో గుర్తింపు పొందింది. అలాగే ఆమె నటించిన మై లవ్ ఫ్రమ్ ది స్టార్, ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ టెలివిజన్ సీరీస్ లు కూడా బాగా ప్రజాదరణ పొందాయి.
/rtv/media/media_files/2025/08/28/sv-krishna-reddy-pic-three-2025-08-28-20-36-29.jpeg)
‘వేదవ్యాస్’ చిత్రం ఒక మంచి సందేశంతో కూడిన కుటుంబ కథా నేపథ్యంగా ఉండబోతుందని దర్శకుడు కృష్ణారెడ్డి తెలిపారు.
/rtv/media/media_files/2025/08/28/sv-krishna-reddy-2025-08-28-20-36-29.jpg)
చివరిగా ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృషారెడ్డి.. దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకొని వేదవ్యాస్ చిత్రాన్ని ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/08/28/sv-krishna-reddy-pic-one-2025-08-28-20-36-29.jpeg)
ఈ చిత్రాన్ని కాంగ్రెస్ నేత , వ్యాపార వేత్త కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.