Srividya : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసింది.. ఈ అలనాటి నటి రియల్ లైఫ్ హీరోయిన్! సినీ కెరీర్ లో తాను సంపాదించిన కోట్ల రూపాయలను పేద ప్రజలకు, పేద విద్యార్థులు కోసం ఇచ్చేసింది. ఈ ప్రముఖ నటి ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 16 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 ఏ నటీనటులకైనా సినీ రంగంలో సక్సెస్ అవ్వడం అనేది పూల పాన్పు కాదు. ఒక్కసారి సినిమాల్లో అవకాశం వస్తే ఇక పెద్ద సెలెబ్రెటీలు అయిపోయినట్లే అని చాలా మంది అనుకుంటారు. కానీ సినీ ప్రపంచం అనుకున్నంత అందంగా ఉండదు. ఎన్నో ముళ్ళ బాటలు దాటినా తర్వాత పూల పాన్పు ఎదురవుతుంది. అలా ఎంతో కష్టపడి ఎదిగిన నటీమణుల్లో అందాల తార శ్రీవిద్య ఒకరు. 2/7 శ్రీవిద్య పుట్టిన ఏడాదికే ఆమె తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో 14 ఏళ్లకే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది శ్రీవిద్య. శివాజీ గణేశన్ సరసన 'తిరువరుట్చెల్వన్' సినిమాతో శ్రీవిద్య తమిళ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. 3/7 ఆ తర్వాత దాసరి నారాయణ దర్శకత్వంలో 'తాతా మనవడు' సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. ఆమె అద్భుతమైన నటన, అద్భుతమైన నృత్యం, ఆకర్షణీయమైన అందంతో మరిన్ని అవకాశాలను దక్కించుకుంది. కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో పనిచేసి అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. 4/7 కెరీర్ సక్సెస్ ఫుల్ సాగుతుండగా శ్రీవిద్య 1978 లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ను వివాహం చేసుకున్నారు. వివాహానంతరం నటి శ్రీవిద్య సినిమాలకు దూరమైంది. కానీ పెళ్ళైన తర్వాత శ్రీవిద్య జీవితం అనుకోని మలుపు తిరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త జార్జ్ తన తీసుకొని ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారట. 5/7 ఆ తర్వాత 1980లో భర్తతో విడాకులు తీసుకున్న శ్రీవిద్య.. ఆర్ధిక ఇబ్బందులతో మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీవిద్య మలయాళం,తమిళ్, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ముందుకెళ్లింది. కష్టాలను ఎదుర్కొని ఆమె పైకి లేచినా.. విధి మాత్రం ఆమెను చిన్న చూపు చూసింది. 2003లో శ్రీవిద్యకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 6/7 చివరి రోజుల్లో శ్రీవిద్య తాను సంపాదించిన సంపద మొత్తాన్ని సంగీత, నృత్య కళాశాలలోని పేద విద్యార్థులకు సహాయంగా అందించి గొప్ప మనసును చాటుకున్నారు. శ్రీవిద్యకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె భరత నాట్యం నేర్చుకున్నారు. నటుడు గణేష్ సహాయంతో ఆమె ఒక ట్రస్టును కూడా స్థాపించారు. నటి శ్రీవిద్య అక్టోబర్ 19, 2006లో మరణించారు. 7/7 అయితే అప్పట్లో శ్రీవిద్య, కమల్ హాసన్ చాలా చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ శ్రీవిద్య తల్లి పెళ్ళికి అనుమతించకపోవడంతో వీరి ప్రేమ అక్కడితోనే ముగిసిపోయిందని అంటారు. #srividya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి