Singer Mano : పోలీసుల అదుపులో సింగర్ మనో కొడుకులు.. ఏం జరిగిందంటే

ప్రముఖ గాయకుడు మనో కుమారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందింది. వలసరవాక్కంలోని శ్రీదేవి కుప్పంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినందుకు గాను మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

mano
New Update

Singer Mano Sons Arrest 

 ప్రముఖ గాయకుడు మనో కుమారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో చెన్నై వళసరవాక్కం పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మదురవాయల్‌కు చెందిన 16 యేళ్ల బాలుడు వలసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడెమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి శిక్షణ పూర్తి చేసుకుని స్థానికంగా ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. ఆ సమయంలో గాయకుడు మనో కుమారుడు సహా ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్, 16 ఏళ్ల బాలుడితో గొడవపడి దాడి చేసినట్లు తెలిసింది.ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడున్న స్థానికులు గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన కృపాకరన్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో అతని ఫిర్యాదు మేరకు వళసరవాక్కం పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకోగా..మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో మనో కుమారులు రఫీ, షకీర్‌లపై కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపర్చడం వంటి వివిధ సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మనో కుమారులు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడి, దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.  ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక సింగర్ మనో విషయానికొస్తే.. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు సుమారు 3000 పైగా పాటలు పాడిన ఆయన 3000 కంటే ఎక్కువ ప్రత్యక్ష వేదికలపై కచేరీలలో పాల్గొన్నాడు. ప్రస్తుతం సినిమాల్లో పాటలు పాడుతూనే బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా పనిస్తున్నారు. తమిళంలో సూపర్ సింగర్, ఇండియన్ ఐడల్ వంటి షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మన తెలుగు బుల్లితెర టాప్ కామెడీ షో అయిన 'జబర్దస్త్' లోనూ ఓ జడ్జిగా ఉన్నారు. 

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe