/rtv/media/media_files/2025/10/25/sharwanand-biker-2025-10-25-07-46-39.jpg)
Sharwanand Biker
Sharwanand Biker: సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే టాలెంట్ తో పాటు లుక్స్ కూడా చాలా ముఖ్యం. హీరో కానీ, హీరోయిన్ కానీ, మంచి లుక్ ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకోవడం సులభం అవుతోంది. అందుకే చాలా మంది నటులు తమ పాత్రలకు తగ్గట్టుగా లుక్స్ మార్చుకుంటూ ఉంటారు. ఇటీవల మహేష్ బాబు, నాని, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు తమ కొత్త సినిమాల కోసం పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి శర్వానంద్ కూడా చేరాడు.
శర్వానంద్ ప్రస్తుతం ‘బైకర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకుడు, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. 2025 దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ‘బైకర్’ ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బైక్ రేస్ ట్రాక్‌పై స్పోర్ట్స్ బైక్‌పై దూసుకెళ్తున్న స్టైలిష్ లుక్‌లో శర్వా కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, అటిట్యూడ్ చూస్తే పూర్తిగా కొత్తగా అనిపించాడు.
Sharwanand Shirtless Photos
ఇదిలా ఉండగా, శర్వానంద్ ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన షర్ట్‌లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఫోటోల్లో ఆయన పూర్తిగా సన్నగా, బక్కచిక్కి కనిపిస్తున్నారు. ముఖం కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని రీతిలో ఫిట్‌గా, కట్‌గా ఉన్న శర్వా లుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు - “అయ్యో.. ఇది నిజంగా శర్వానందేనా?”, “ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా సాధ్యమయ్యింది?”, “బైకర్ కోసం ఇంత కష్టపడ్డాడా?” అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా..?
శర్వానంద్ ఎప్పుడూ తన పాత్రల కోసం కొత్తగా ప్రయత్నించే నటుడిగా పేరుపొందాడు. గతంలో కూడా ‘రణరంగం’, ‘మహాసముద్రం’ వంటి సినిమాల్లో ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఆకట్టుకున్నాడు. కానీ ఈసారి మాత్రం లుక్ పూర్తిగా షాకింగ్‌గా ఉంది.
‘బైకర్’ సినిమా యాక్షన్, స్పోర్ట్స్, డ్రామా అంశాలతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. శర్వా ఇందులో ప్రొఫెషనల్ రేసర్‌గా నటిస్తున్నాడని టాక్. అందుకే పాత్రకు తగ్గట్టుగా బాడీని సన్నగా మార్చుకున్నాడు.
మొత్తం మీద, శర్వానంద్ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన డెడికేషన్, ఫిజికల్ చేంజ్ తో మరోసారి తన కెరీర్‌పై ఉన్న ప్యాషన్‌ను చూపించాడు. ‘బైకర్’తో శర్వా మళ్లీ పెద్ద హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Follow Us