భాషతో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఒకరు. నాలుగు పదుల వయసులోనే సూపర్ హిట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్.. 'దేవదాసు' సినిమా సమయంలో తాను ఆందోళనకు గురైనట్లు తెలియజేస్తూ.. ఆ రోజులను గుర్తుచేసుకున్నారు.
2002లో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' షారుక్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమా చేసేటప్పుడు షారుఖ్ ఆందోళనకు గురయ్యారట. షారుక్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. దేవదాసు చిత్రాన్ని తన అమ్మ కోసం అంగీకరించినట్లు తెలిపారు.
కానీ గతంలో దిలీప్ కుమార్, కెఎల్ సైగల్ వంటి ఎంతోమంది గొప్పనటులు అలాంటి పాత్రను పోషించారని. దీంతో వారిలా నేను నటించలేనేమోనని చాలా మంది సినిమాను అంగీకరించొద్దని సలహా ఇచ్చారు... కానీ తాను మాత్రం ఆ ప్రాజెక్ట్ లో నటించాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు షారుక్ తెలిపారు.
అలాగే ఆ సినిమా విడుదల సమయంలో తాను ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ఆ టైంలోనే పాత్ర కోసం మద్యం కూడా అలవాటు చేసుకున్నాని.. బహుశ ఆ అలవాటే 'దేవదాసు' సినిమాకు తనకు ఉత్తమ నటుడిగా అవార్డును తెచ్చిందేమో అని సరదాగా చెప్పారు షారుక్.
'దేవదాసు' పూర్తయ్యాక దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తనపై ప్రశంసల వర్షం కురిపించారని షారుక్ ఆ రోజులను గుర్తుచేసుకున్నారు. ' దేవదాస్ ' చిత్రంలో ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ఫిమేల్ లీడ్స్ గా నటించారు.
రీసెంట్ గా 'జవాన్' సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టిన షారుఖ్ ప్రస్తుతం 'కింగ్' సినిమా చేస్తున్నారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ తో పాటు షారుక్ కూతురు సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్.