భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఒకరు. ఐదు పదుల వయసులోనే సూపర్ హిట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను రికార్డులను షేక్ చేస్తున్నారు. నేడు షారుక్ ఖాన్ పుట్టినరోజు. ఈరోజు 59వ వసంతంలోకి అడుగుపెట్టారు.
షారుక్ 1992 ' దీవానా' సినిమాతో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. డర్, కరణ్ అర్జున్, యస్ బాస్, బాజీగర్, స్వదేశ్, వీర్ జరా వంటి సూపర్‌హిట్ చిత్రాలతో షారుక్ వెనుదిరిగి చూడలేదు. కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్లారు.
ఆ తర్వాత చక్ దే ఇండియా', దిల్వాలే, రయీస్ సినిమాలు షారుక్ స్టార్‌డమ్‌ను మరింత పెంచాయి. 2002లో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' షారుక్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అప్పటివరకు సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న షారుఖ్ కేరీర్ కు 2018లో బ్రేక్ పడింది.
2017, 2018 టైంలో విడుదలైన 'ఫ్యాన్', 'డియర్ జిదాంగి', 'జబ్ హ్యారీ మెట్ సెజల్ సెజల్' వంటి చిత్రాలకు బాక్స్ ఆఫీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. జబ్ హ్యారీ మెట్ సెజల్ సెజల్, జీరో భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. జీరో ఫ్లాప్ అవడంతో డైరెక్టర్ ఆనంద్ ఎల్.రాయ్ కుప్పకూలిపోయాడు.
'జీరో' తర్వాత ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుఖ్ 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1' లో అతిధి పాత్రలో కనిపించడు. ఆ తర్వాత 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' మరియు 'లాల్ సింగ్ చద్దా' వంటి అనేక చిత్రాలు విడుదలయ్యాయి. కానీ షారుక్ ఇమేజ్ ను సంతోషపెట్టలేకపోయాయి.
జనవరి 2023 లో విడుదలైన 'పఠాన్' జవాన్, డంకీ సినిమాలతో తో మళ్ళీ తిరిగి ఫార్మ్ లోకి వచ్చారు షారుక్. జవాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో తాను కోల్పోయిన స్టార్‌డమ్‌ను మళ్ళీ పొందాడు షారుఖ్.
జవాన్ సినిమాకు గానూ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా రూ. 604 కోట్లకు పైగా వసూళు రాబట్టింది. చాలా కాలం తరువాత జవాన్ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.