Rajinikanth Jailer 2: రజినీకాంత్ ‘జైలర్ 2’లో స్టార్ కమెడియన్.. నెల్సన్ ప్లానింగ్ మాములుగా లేదుగా..!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న “జైలర్ 2” గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీతో సంతానం మళ్ళీ కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు, యోగిబాబుతో కలిసి కామెడీ పండించనున్నాడు. విద్యా బాలన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నారు.

New Update
Rajinikanth Jailer 2

Rajinikanth Jailer 2

Rajinikanth Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) దర్శకత్వంలో రూపొందుతున్న అద్భుత యాక్షన్ ఎంటర్టైనర్ “జైలర్ 2” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గోవాలో ఈ సినిమా షెడ్యూల్ వేగంగా జరుగుతోంది. మొదటి భాగం “జైలర్” 2023లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి, రజినీకాంత్ కెరీర్‌లో మళ్లీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఈ హిట్ తర్వాత సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కమెడియన్‌గా సంతానం ఎంట్రీ 

Comedian Santhanam in Jailer 2

ఇప్పుడు “జైలర్ 2”లో ఒక ఆసక్తికరమైన కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు సంతానం(Santhanam) ఈ సినిమాలో కమెడియన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. గత కొంతకాలంగా సంతానం హీరోగా సినిమాలు చేస్తూ ఉన్నా, ఇప్పుడు ఆయన మళ్లీ కామెడీ రోల్‌లో కనిపించబోతుండటం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది.

సెట్స్ నుంచి వచ్చిన వార్తల ప్రకారం, తాజా షెడ్యూల్‌లో సంతానం షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు యోగిబాబు కూడా సినిమాలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కమెడియన్లు కలిసి తెరపై నవ్వుల పండుగ సృష్టించబోతున్నారన్న వార్తతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. దర్శకుడు నెల్సన్ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ కి, రజినీకాంత్ మాస్ ఎనర్జీ కలిస్తే ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్‌మెంట్ గ్యారంటీ అని చెప్పవచ్చు. అదే కాకుండా, ఈసారి సినిమా కథలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

సినిమా సంగీతాన్ని యువ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. మొదటి భాగం మాదిరిగానే ఈసారి కూడా ఆయన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. తాజా ప్లాన్ ప్రకారం, “జైలర్ 2” జూన్ 12, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

మాస్ యాక్షన్, కామెడీ, అనిరుద్ మ్యూజిక్, సంతానం- యోగిబాబు కాంబో ఇవన్నీ కలిసి “జైలర్ 2”ని 2026లో అత్యంత ఎదురుచూస్తున్నసినిమా కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు