/rtv/media/media_files/2025/10/22/prabhas-spirit-2025-10-22-15-50-06.jpg)
Prabhas Spirit
Prabhas Birthday: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, "యానిమల్" ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "స్పిరిట్" గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి బజ్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా కాలమే అయినా, ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ద్వారా కొత్త సినిమాటిక్ యూనివర్స్ మొదలవుతుందని తెలుస్తోంది.
2026లో షూటింగ్ స్టార్ట్..?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, "స్పిరిట్" మూవీ షూటింగ్ 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ ముంబైలో జరగనుండగా, ఆ తర్వాత యూనిట్ మెక్సికో, థాయ్‌లాండ్, ఇండోనేసియాకి వెళ్లనుంది. ముఖ్యంగా ముంబై షెడ్యూల్‌లో ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్ సీన్‌లను చిత్రీకరించబోతున్నారని టాక్. ప్రభాస్ బర్త్డే(Prabhas Birthday) సందర్భంగా స్పిరిట్ మూవీ నుండి ఏదైనా అప్ డేట్ వస్తుంది అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
డ్యూయల్ షేడ్స్‌లో ప్రభాస్
ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్‌గా ఆయన స్టైలిష్ లుక్, మరోవైపు విభిన్న కాల ఘట్టానికి చెందిన ఫ్లాష్‌బ్యాక్ లుక్ ఉండనుందని సమాచారం. ఇది ఆయన నటనలో మరో ప్రత్యేక పాత్రగా నిలవనుంది.
"స్పిరిట్" క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్..!
సినిమా చివర్లో ఓ క్లిఫ్‌హ్యాంగర్ తో సినిమా ముగియవచ్చని చర్చలు జరుగుతున్నాయట. అంటే కథ అక్కడే ఆగి, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా సీక్వెల్‌కు దారి చూపేలా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది సందీప్ వంగా క్రియేట్ చేయబోయే కొత్త యూనివర్స్‌కు బేస్ అవుతుందని చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంగీతం హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలు టీ-సిరీస్ భద్రకాళి పిక్చర్స్ కలిసి ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.
మొత్తానికి, "స్పిరిట్" సినిమా ఒక్క ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాదు, యాక్షన్ సినిమాలు ప్రేమించే ప్రతీ ఒక్కరికీ మరో మాస్ ఫెస్టివల్ కానుంది. సందీప్ వంగా కొత్త యూనివర్స్‌కు శ్రీకారం చుడుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
Follow Us