/rtv/media/media_files/2025/12/01/samantha-marriage-2025-12-01-08-55-34.jpg)
Samantha Marriage
Samantha Marriage: నటి సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకోనుందంటూ అనేక పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై సమంత, రాజ్ ఇంత వరకు స్పందించలేదు.
ఈ రూమర్‌కి బలమైన కారణం ఒకే ఒక్క పోస్ట్. అదే రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలిదేవి చేసిన వ్యాఖ్య. ఆమె “తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు” అంటూ సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్య రాజ్- సమంత పెళ్లి వార్తలతో జతకట్టి మరింత సందేహాలు పెంచుతోంది.
Shhyamalide insta story after Samantha -Raj marriage news pic.twitter.com/q2mh4XE7px
— CineScoop (@Cinescoop7) November 30, 2025సమంత గతంలో నాగ చైతన్యతో 2017లో పెళ్లి చేసుకుంది. అయితే 2021లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత చైతన్య శోభితా ధూలిపాలాతో దగ్గరై, వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సమంత కూడా తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడుతోందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, సమంత- రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న ఈషా సెంటర్‌లో వివాహం చేసుకోనున్నారట. సమంత గతంలో కూడా ఆధ్యాత్మిక కారణాలతో ఈషా యోగా సెంటర్‌కు తరచూ వెళ్లిన విషయం తెలిసిందే. అందుకే ఈ వార్తలు మరింత నిజం అనిపిస్తున్నాయి.
సమంత మొదటగా రాజ్‌తో ది ఫ్యామిలీ మాన్ 2లో పనిచేసింది. ఆ సిరీస్ ఆమెకు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని ప్రచారం. తరువాత రాజ్- కృష్ణ డీకేల జోడీ ఆమెను సిటాడెల్: హనీ బన్నీలో కూడా నటించేలా చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి తరచూ వార్తలు వచ్చాయి.
అయితే ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ రూమర్స్ నిజమా? కాదా? అనేది స్పష్టత కావాలి. రాజ్ మాజీ భార్య చేసిన పోస్ట్ మాత్రం ప్రజల్లో కొత్త చర్చలకు దారి తీస్తోంది.
ప్రస్తుతం అభిమానులు, నెటిజన్లు సమంత నుంచి ఏదైనా క్లారిటీ వచ్చే వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఆమె పెళ్లి విషయం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us