Kantara Chapter 1 Review: అంచనాలను ఆకాశానికెత్తిన ‘కాంతార చాప్టర్ 1’.. ట్విట్టర్ రివ్యూ మైండ్ బ్లోయింగ్

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ ప్రీక్వెల్ 'కాంతారా చాప్టర్ 1' నేడు భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైంది

New Update
Kantara Chapter 1 Release Date

Kantara Chapter 1 Review: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ ప్రీక్వెల్ 'కాంతారా చాప్టర్ 1' నేడు భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైంది. అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి.  ఫస్ట్ హాఫ్ ఫన్, యాక్షన్ తో నిండిన స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉందని చెబుతున్నారు. రిషబ్ శెట్టి స్క్రీన్ ప్రజెన్స్, ఫైరీ యాక్షన్ బ్లక్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. సినిమా మేకింగ్, విజువల్స్, VFXహైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు.

హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా.. ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుందని రివ్యూలు పెడుతున్నారు. ఇతిహాస కథలు, పురాణాలు ఇష్టపడే వారికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుందట. 

మరో నెటిజన్.. రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ మాటల్లో చెప్పలేనిది! అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. సినిమాలో రుక్మిణి వసంత్ ఒక సర్ప్రైజింగ్ ప్యాజేజ్.. క్లైమాక్స్ లో ఆమె ట్విస్ట్ అదిరిపోయింది. జానపద కథలు, విశ్వాసాలు, ఇతిహాసాలకు కొత్త సాంకేతికతను జోడించి చేసిన సినిమాటిక్ మిశ్రమం కాంతారా చాప్టర్ 1 అంటూ ట్విట్టర్ రివ్యూ పోస్ట్ చేశాడు. 

క్లైమాక్స్ట్విస్ట్ 

అరవింద్ కశ్యప్  సినిమాటోగ్రాఫీ, అజినీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా మరోసారి సత్తాచాటారని, పాత్ర కోసం ప్రాణం పెట్టారని  అనుకుంటున్నారు. తన విజన్ ని స్క్రీన్ పై సరిగ్గా ప్రజెంట్ చేయగలిగారని చెబుతున్నారు. భూతకోల ఆచారం ఎలా మొదలైంది అనే  కథాంశానికి సాంకేతికతను జోడించి అద్భుతంగా చూపించారని కొనియాడుతున్నారు.

ఫస్ట్ పార్ట్ మాదిరిగానే సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని.. మరిచిపోలేని అనుభూతుని ఇస్తుందని చెబుతున్నారు. మొదటి పార్ట్ కంటే ప్రీక్వేల్ స్కెల్ చాలా పెద్దదిగా, రిచ్ గా అనిపించిందని అభిప్రాయపడుతున్నారు . మొత్తానికి టెక్నీకల్, విజువల్ పరంగా కాంతారా చాప్టర్ 1 మంచి సినిమాటిక్ అనుభవాన్ని అందించిందని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు