/rtv/media/media_files/2026/02/17/rana-jai-hanuman-2026-02-17-07-28-17.jpg)
Rana Jai Hanuman
Rana Jai Hanuman: సంక్రాంతి 2024కి చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్’ భారీ విజయాన్ని సాధించింది. పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయినా కూడా మంచి వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ, చివర్లో ‘జై హనుమాన్’ అనే సీక్వెల్ వస్తుందని ప్రకటించారు.
Devotees, get ready! 🚩@shetty_rishab ‘s #JaiHanuman – the epic sequel to the blockbuster #Hanuman – launches with a grand Pooja ceremony on February 22nd at sacred Hampi, Karnataka!
— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) February 12, 2026
Directed by Prasanth Varma 🎬
Produced by Mythri Movie Makers 💸
Jai Shri Ram! 🏹🙏… pic.twitter.com/YLVi94jO3X
‘జై హనుమాన్’ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆంజనేయస్వామి పాత్రలో ‘కాంతారా’ ఫేమ్ రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన హనుమంతుడి లుక్‌ను విడుదల చేయగా, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
గత రెండేళ్లుగా రిషబ్ శెట్టి ‘కాంతారా 2’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ‘జై హనుమాన్’ ఆలస్యమైంది. అయితే ఈలోపు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ, స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మార్చి 22న హంపిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. సినిమా మొత్తం హనుమంతుడి నేపథ్యంతో సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాలో తేజ సజ్జ కనిపించకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. రానా కోసం యంగ్, ఓల్డ్ లుక్స్‌లో లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్టు సమాచారం.
మొత్తానికి ‘జై హనుమాన్’పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. షూటింగ్ ప్రారంభం తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది.
Follow Us