/rtv/media/media_files/skNQAHlbgClHY6CUB35e.jpg)
rana
Rana Daggubati: టాలీవుడ్ భల్లాలదేవ దేవ రానా బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు బాలీవుడ్ లో తెలుగు సినిమాలను ప్రమోట్ చేయడంలోనూ ముందుంటాడు రానా. బీటౌన్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న హీరోల్లో రానా ఒకరనే చెప్పొచ్చు.
షారుఖ్ పాదాలు తాకిన రానా
ఇది ఇలా ఉంటే రానా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ పాదాలకు నమస్కరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఇటీవలే ముంబైలో జరిగిన ఐఫా 2024 అవార్డ్స్ ప్రెస్ మీట్ కు రానా, షారుక్, కరణ్ జోహార్, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక పైకి వెళ్లిన రానా అక్కడ షారుఖ్ పాదాలను నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. రానా.. షారుఖ్ పాదాలను తాకుతూ.. మేమంతా దక్షిణ భారతీయులం. ఇది మన సంస్కృతి అంటూ చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత షారుఖ్ రానాను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రానా సంస్కారానికి ఫిదా అవుతున్నారు.
Stardom is one thing, but earning respect across the industry is another. 🤩 Witnessing the moment when #RanaDaggubati humbly touched #ShahRukhKhan’s feet at the #IIFA press conference reminds us why SRK is truly the King – not just of cinema, but of hearts too! 🫶
— Gulbibi (@sangitajadon95) September 10, 2024
A gesture of… pic.twitter.com/RxFoEhCeSJ
ఐఫా అవార్డ్స్ ఈవెంట్ 2024 వేడుకలు సెప్టెంబర్ 27 నుంచి 29వరకు UAE లోని అబుదాబి ఐలాండ్ లో నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ లో ఉత్తమ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ చిత్రాలు, ఉత్తమ నటీనటులు సందడి చేయనున్నారు. రానా ప్రస్తుతం మలయాళ నటుడు హీరోగా తెరకెక్కనున్న ‘కాంత’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 'నీలా' మూవీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవలే పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రానా, దుల్కర్, నటి బాగ్య శ్రీ పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.