/rtv/media/media_files/2025/11/03/ramya-krishnan-2025-11-03-10-22-12.jpg)
Ramya Krishnan
Ramya Krishnan: దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మళ్లీ తనకు ఇష్టమైన హారర్ జానర్‌తో తిరిగొచ్చాడు. ఆయన తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం పేరు పోలీస్ స్టేషన్ మేన్ భూత్. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్‌గా జెనీలియా దేశ్‌ముఖ్ కనిపించబోతున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా గురించి అంతగా వివరాలు బయటకు రాలేదు. కానీ నిన్న రాత్రి ఆర్జీవీ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేయడంతో అభిమానుల్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో అని అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే కొద్దిసేపటికి తెలిసిందేంటంటే ఆ లుక్‌లో కనిపించినది మరెవరో కాదు, మన సీనియర్ నటి రమ్యకృష్ణన్ గారే!
Here is @meramyakrishnan in POLICE STATION MEIN BHOOT pic.twitter.com/RZejGAW3gi
— Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2025
RGV Horror Movie
ఈ రోజు ఉదయం ఆర్జీవీ ఆమె లుక్‌ను రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలో రమ్యకృష్ణన్ గారు బోల్డ్ లుక్‌లో అద్భుతంగా కనిపిస్తున్నారు. ఫుల్ మేకప్, ఒంటి నిండా నగలు, ముఖంపై ఉన్న ఆర్ట్ మార్కింగ్స్ అన్ని ఆమెను పూర్తిగా కొత్త అవతారంలో చూపిస్తున్నాయి. ఆ లుక్‌లో ఆమెను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
ఆమె పాత్ర గురించి ఇంకా పూర్తి వివరాలు చెప్పలేదు. కానీ ఆర్జీవీ స్టైల్‌ను బట్టి చూస్తే, ఇది సాధారణ పాత్ర కాదని అభిమానులు అంటున్నారు. సినిమా మొత్తం హారర్, సస్పెన్స్ ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి.
పోలీస్ స్టేషన్ మేన్ భూత్ సినిమాను వావ్ ఎమిరేట్స్ మీడియా ప్రొడక్షన్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఎక్కువ భాగం ఇండోర్ లొకేషన్లలోనే జరుగుతోందని సమాచారం.
సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ సినిమా 2026లో థియేటర్లలో విడుదల కానుందని టాక్ ఉంది. హారర్ జానర్‌లో ఆర్జీవీకి ఉన్న ప్రత్యేక స్టైల్ కారణంగా, ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొత్తానికి, రమ్యకృష్ణన్ గారి ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో హీట్‌గా మారింది. ఆర్జీవీ, మనోజ్ బాజ్‌పేయీ, జెనీలియా, రామ్యకృష్ణన్ ఈ కాంబినేషన్ సినిమా హారర్ అభిమానులకు తప్పకుండా ఒక ప్రత్యేక అనుభూతి ఇవ్వబోతోందని చెప్పొచ్చు.
Follow Us