Rajini Kamal Movie: రజనీ-కమల్‌ మూవీ సస్పెన్స్ కు తెర పడినట్టేనా..? ప్రోమో షూట్ షురూ!

కమల్ హాసన్ - రజనీకాంత్ కలిసి నటించే కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ప్రోమో షూట్ ఈరోజు నెల్సన్ డైరెక్షన్ లో ప్రసాద్ స్టూడియోస్‌లో మొదలవుతుందని బజ్. రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమార్ ఫిల్మ్స్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు.

New Update
Rajini Kamal Movie

Rajini Kamal Movie

Rajini Kamal Movie: కమల్ హాసన్ - రజనీకాంత్ కలిసి నటించే కొత్త సినిమా గురించి మళ్లీ పెద్ద బజ్ మొదలైంది. ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ఆశలకు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

ముందుగా ఈ సినిమాకు ‘డాక్టర్’, 'జైలర్' సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్ ప్రోమో షూట్ ఈరోజే చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్‌లో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

ఈ ప్రోమో షూట్‌కు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ కెమెరా బాధ్యతలు చూస్తున్నారని సమాచారం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ షూట్‌లో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, దర్శకుడు నెల్సన్ ఇద్దరూ మేకప్ మెన్‌లాగా కనిపించబోతున్నారట. ఇది అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచుతోంది.

ఈ ప్రోమో కోసం స్టూడియోలో పెద్ద మెకానిక్ షెడ్ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించారట. ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ఎలా ఉండనుందో అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ భారీ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమార్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కలిసి నిర్మిస్తున్నాయి. అధికారిక ప్రకటన వీడియో విడుదల అయితే, ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అభిమానుల ఉత్సాహం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

Advertisment
తాజా కథనాలు