Coolie: లోకేష్ కనగరాజ్ - సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన 'కూలీ' నేడు భారీ అంచనాలు నడుమ థియేటర్స్ లో విడుదలైంది. తమిళ్ తలైవా, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇలా అన్ని ఇండస్ట్రీలోని స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉండడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇది మాత్రమే కాదు 'ఖైదీ', 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టార్ల తర్వాత లోకేష్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, కూలీ ఆ అంచనాలను అందుకోలేకపోయినట్లు తెలుస్తుంది. సినిమాలో రజినీ స్టైల్, యాక్షన్ ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చినా.. కథ పరంగా ఆకట్టుకోవడంలో కొంతమేర విఫలమైంది. అదే ఫ్ల్యాష్ బ్యాక్ డ్రామాతో స్టోరీని రొటీన్ ముంగించారన్న ఫీలింగ్ కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'కూలీ' లో మైనస్ పాయింట్స్ ఏంటోఇక్కడ తెలుసుకుందాం..
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథనం
ఫస్ట్ ఆఫ్ లోనే సినిమా కథ మొత్తం అర్థమైపోతుంది. 'ఖైదీ', 'విక్రమ్' లాంటి సినిమాల్లో లోకేష్ స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠగా ఉంటుంది. కానీ 'కూలీ'లో ఆ లోకేష్ మార్క్ కనిపించలేదని చాలామంది విమర్శించారు.
సెకండ్ హాఫ్ ల్యాగ్
ఫస్ట్ హాఫ్ హీరో ఎంట్రీ సీన్, ఎలివేషన్స్, నాగార్జున ఇంట్రో వంటి అంశాలతో ఆసక్తికరంగా ఉన్నా.. సెకండ్ ఆఫ్ మాత్రం చాలా నెమ్మదిగా సాగిందని, డ్రామా ఎక్కువగా ఉందని ప్రేక్షకులు భావించారు. సెకండ్ ఆఫ్ మంచి యాక్షన్ సీక్వెన్సులు ఉన్నప్పటికీ.. కథనంలో వేగం సినిమాకు మైనస్ పాయింట్‌గా మారింది.
Back To Back Disaster Movies For Rajini 🤣🤣😭
— Flop Kumar Ajith 2.0 (@Flopkumarajith2) August 14, 2025
Lal Salam, Vettaiyan, Now Coolie 🥺
Leo This Scene >>>>>> Whole Coolie #CoolieDisaster#Coolie#CoolieFDFS#JanaNayagan#ThalapathyVijaypic.twitter.com/jaOWDbXDrq
అతిథి పాత్రలు నిరుత్సాహం
ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి పెద్ద స్టార్లు నటించడం సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ, సినిమాలో వీరి పాత్రలను సరిగ్గా వాడుకోలేదని విమర్శలు వస్తున్నాయి. కింగ్ నాగ్ స్టైలిష్ విలన్ రోల్లో ఓ రేంజ్ ఆకట్టుకున్నపటికీ.. అమీర్ ఖాన్, ఉపేంద్ర క్యామియోలు వేస్టేడ్ అన్న ఫీలింగ్ కలిగించింది ప్రేక్షకులకు. కేవలం 'విక్రమ్' సినిమాలో రోలెక్స్ పాత్రను గుర్తు చేసిందని కొందరు అభిప్రాయపడ్డారు.
రొటీన్ పాయింట్స్
స్మగ్లర్ గా రజినీకాంత్ పాత ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నప్పటికీ.. రొటీన్ కథ అనే ఫీలింగ్ కలిగింది. ముందు ఒక సాధారణమైన వ్యక్తిగా కనిపించే హీరోకు.. గతంలో ఒక భారీ ఫ్ల్యాష్ బ్యాక్ అనే రొటీన్ కాన్సెప్ట్ ని చూపించారు. ఇది చూస్తుంటే బాషా, కబాలి లాంటి సినిమాల్లోని అంశాలు గుర్తొచ్చాయని అంటున్నారు. అలాగే సినిమాలో రజినీ మార్క్ డైలాగ్స్ లేవు.
మోనికా సాంగ్
'కూలీ' ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఎక్కడ చూసిన 'మోనికా' సాంగ్ ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలో పూజ తన గ్లామర్, ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టింది. దీంతో ఫ్యాన్స్ ఈ పాటను థియేటర్లో ఎప్పుడెప్పుడు చూద్దామా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఈ సినిమాలో 'మోనికా' సాంగ్ టైమింగ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ టైంలో సాంగ్ ఏంటి? అన్న ఫీలింగ్ కలిగించింది.
మొత్తానికి రజినీకాంత్ స్టైల్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు బలంగా నిలిచాయి. కానీ బలహీనమైన కథనం, నెమ్మదిగా సాగిన స్క్రీన్‌ప్లే, అతిథి పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వంటివి సినిమాకి మైనస్ గా నిలిచాయి. అయినప్పటికీ, రజినీకాంత్ బాక్సాఫీస్ స్టామినా కారణంగా సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కానీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని చాలామంది విమర్శలు వస్తున్నాయి.