/rtv/media/media_files/2025/11/14/raja-saab-vs-akhanda2-2025-11-14-12-04-10.jpg)
Raja Saab vs Akhanda2
Raja Saab vs Akhanda2: టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పెద్ద సినిమాల్లో అఖండ 2 ఒకటి. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ జోడీ ఇచ్చిన అఖండ బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చే సీక్వెల్ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. బాలయ్య పవర్‌ఫుల్ లుక్, బోయపాటి స్టైల్ మాస్ ఎలివేషన్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం షూటింగ్ పూర్తయ్యి, డబ్బింగ్ కూడా ముగిసింది. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ముందుగా మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనకు సంబంధించిన ప్రమోషన్లను కూడా విడుదల చేశారు.
అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 5 రిలీజ్ సాధ్యం కాకపోవచ్చు. సినిమా రిలీజ్‌కి 20 రోజులు మాత్రమే ఉండగా ఇంకా ప్రమోషన్లను వేగంగా ప్రారంభించకపోవడం, గ్రాఫిక్స్ పనులు పూర్తి కాలేకపోవడం వంటి కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడే అవకాశాలపై చర్చ సాగుతోంది.
ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే - అఖండ 2 మేకర్స్ సంక్రాంతి విడుదలపై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 9న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదని వినిపిస్తూ ఉండడంతో అది తప్పకుండా వాయిదా పడుతుందని టాక్ నడుస్తోంది.
అయితే రాజాసాబ్ రిలీజ్ జరగకపోతే, ఆ ఖాళీ స్లాట్‌లో అఖండ 2ను రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా జరిగితే ఈసారి సంక్రాంతి పండుగకు మళ్లీ బాలయ్య vs చిరంజీవి బాక్సాఫీస్ పోటీ అవకాశం ఉంది.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో వస్తుండగా, బాలయ్య అఖండ 2తో అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. రెండూ పెద్ద సినిమాలే కావడంతో సంక్రాంతి రేసు మరింత ఆసక్తికరంగా మారొచ్చు.
ఇక అభిమానులు మాత్రం అఖండ 2 ఎప్పుడొస్తుందా? నిజంగా సంక్రాంతికి రానుందా? అనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.
Follow Us