2014 లో 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. గ్లామర్, నటనతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ.
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ తాను కలిసి నటించాలనుకున్న నటీనటుల గురించి మాట్లాడింది. ఈ క్రమంలో మహేష్ బాబుతో కలిసి పనిచేయాలనే తన కోరికను తెలిపింది. తాను, మహేష్ బాబు తెరపై అద్భుతంగా కనిపిస్తామని భావిస్తున్నట్లు చెప్పింది. అలాగే ప్రభాస్ తో కూడా కలిసి పనిచేయడం ఇష్టమని తన అభిప్రాయాన్ని చెప్పింది రాశీ.
ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి హారర్ చిత్రం ‘అరణ్మనై 4’లో కనిపించి మెప్పించిన రాశీ.. ప్రస్తుతం తమిళ్లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మరియు ‘తలాఖోన్ మే ఏక్’ వంటి చిత్రల్లో నటిస్తోంది. తెలుగులో ‘తెలుసు కదా’ అనే సినిమా చేస్తోంది.
రాశీ నటిస్తున్న ‘ది సబర్మతి రిపోర్ట్’ 2002లో సబర్మతి ఎక్స్ప్రెస్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి ధీరజ్ సర్నా దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
చివరిగా నాగచైత్యన్య సరసన 'థ్యాంక్యూ' సినిమా డిజాస్టర్ కావడంతో.. ప్రస్తుతం తెలుగులో మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ.
అటు సినిమాలో ను బిజీగా ఉంటూనే, సోషల్ మీడియా లోను తరచూ లేటెస్ట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా రెడ్ డ్రెస్ లో రాశీ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Image Credits: Raashii Khanna/Instagram