/rtv/media/media_files/2026/02/27/raakasa-teaser-2026-02-27-11-43-16.jpg)
Raakasa Teaser
Raakasa Teaser: హారర్, యాక్షన్, కామెడీ మిక్స్ తో రూపొందుతున్న 'రాకాస' సినిమా ప్రమోషన్స్ కొత్త దశలోకి అడుగుపెట్టింది. మార్చి 1న ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే సినిమాపై మంచి ఆసక్తి ఉండగా, టీజర్‌తో ఆ ఉత్సాహాన్ని మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. థియేటర్లలో ఈ చిత్రం 2026 ఏప్రిల్ 3న విడుదల కానుంది.
Veerudu vastunnādu 😎
— Pink Elephant Pictures (@PinkElephant_P) February 26, 2026
Get ready to meet Veeru and witness his chronicles in the world of #Rākāsā 💥#RākāsāTeaser | March 1st 🔥
Catch the madness in cinemas starting April 3, 2026! #RāKāSā ❤️#NiharikaKonidela#SangeethShobhan#NayanSarika@itsmanasasharma#MaheshUppalapic.twitter.com/yEOFXyZYky
టీజర్‌లో కథను పూర్తిగా చెప్పకుండా, సినిమా వాతావరణం, ఇంటెన్సిటీ మాత్రమే చూపించనున్నారు. కథలోని ట్విస్టులను బయటపెట్టకుండా ఆసక్తిని పెంచేలా ప్లాన్ చేశారు. ముందుగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ కూడా అలానే ఉన్నపటికీ, యూట్యూబ్‌లో 1.8 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు, దర్శకత్వం 'మానస శర్మ' వహిస్తున్నారు. ఇది ఆమె తొలి ఫీచర్ ఫిల్మ్. హారర్, కామెడీ రెండూ సమంగా ఉండేలా కథను రూపొందించినట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తై, ప్రస్తుతం ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ వర్క్ జరుగుతోంది.
హీరోగా సంగీత్ శోభన్ నటిస్తున్నారు. ‘MAD’, ‘MAD Square’ విజయాల తర్వాత ఆయన చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి. హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాను నిహారిక కొణిదల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఉమేష్ కుమార్ బన్సాల్ సహనిర్మాతగా ఉన్నారు. జెడ్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సంగీతం అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రాజు ఎడురోలు, ఎడిటింగ్ అన్వర్ అలీ నిర్వహిస్తున్నారు. విదేశీ హక్కులను అతర్వణ భద్రకాళి పిక్చర్స్ సంస్థ కొనుగోలు చేసింది. విదేశాల్లో 350కు పైగా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మొత్తంగా, మార్చి 1న టీజర్ విడుదలతో ‘రాకాస’పై ఆసక్తి మరింత పెరగనుంది. ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Follow Us