/rtv/media/media_files/2026/03/03/prabhas-salaar-2-2026-03-03-16-53-25.jpg)
Prabhas Salaar 2
Prabhas Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘సలార్: సీజ్ ఫైర్’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ రానుంది. ఈ పార్ట్ 2 కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా నిర్మాత విజయ్ కిరగందూర్(Producer Vijay Kiragandur) ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘సలార్ 2 అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అభిమానులు సోషల్ మీడియాలో వరుసగా అప్డేట్స్ అడుగుతున్నారు. వాటిని మేము గమనిస్తున్నాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నాం’ అని తెలిపారు. ఈ వార్తతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది.
"Salaar was a MAMMOTH SUCCESS at the global box office 🥵🥵🥵 and remains one of the MOST-WATCHED films on OTT. NOW Salaar2 is going to be an absolute BEHEMOTH 🔥🔥🔥. We are thrilled to share that we will be diving into production on it very soon."
— KRISHNA MOHAN SASTRY K (@krishna28601466) March 3, 2026
_ Producer Vijay Kiragandur pic.twitter.com/uJ7qp2O4gj
ఇక ముందు ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్, ‘సలార్’ మొదటి భాగం తన అంచనాలకు పూర్తిగా సరిపోలలేదని అన్నారు. ఈ విషయంపై కూడా నిర్మాత స్పందించారు. ‘ప్రశాంత్ నీల్ గొప్ప దర్శకుడు. ఆయన ఎప్పుడూ తన పనిని తానే విమర్శించుకుంటారు. కానీ ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించింది. ఓటీటీలో కూడా అత్యధికంగా వీక్షించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’ అని చెప్పారు.
‘సలార్’ యాక్షన్ సీన్లు మాత్రమే కాదు, ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రభాస్ కెరీర్లో ఇది ఒక స్ట్రాంగ్ మూవీ. ఇప్పుడు పార్ట్ 2 మరింత భారీ స్థాయిలో ఉంటుందని నిర్మాత చెప్పడంతో అభిమానులు మరోసారి పెద్ద స్థాయి యాక్షన్ అనుభవం కోసం ఎదురుచూస్తున్నారు.
Follow Us