Prabhas Birthday: ప్రభాస్ 'పౌర్ణమి' రీ - రిలీజ్.. 19 ఏళ్ళ తర్వాత కూడా ఎందుకు చూడాలంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష కంబినేషన్ లో 2006 ఏప్రిల్ 20న రిలీజైన క్లాసికల్ మూవీ 'పౌర్ణమి' సినిమా మళ్ళీ 19ఏళ్ళ తర్వాత ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.

author-image
By Lok Prakash
New Update
Pournami 4K Re-Release

Prabhas Pournami Re Release

Prabhas Birthday: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ త్రిష కాంబినేషన్ లో   2006 ఏప్రిల్ 20న విడుదలైన పౌర్ణమి సినిమా ఒక రొమాంటిక్-యాక్షన్- క్లాసికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీలో కేవలం ప్రేమ కథ మాత్రమే కాకుండా సంగీత, నృత్యం కలిపిన అద్భుత క్లాసికల్ టచ్ కూడా చూపించారు..

కథలోకి వెళ్తే..

ఒక గ్రామంలో వర్షాలు లేకపోవడంతో, ఆ గ్రామీయులు ప్రతి 12 వేళ్ళకోసారి ఒక సంప్రదాయ నృత్యం చేసి, వర్షం తీసుకురావడం అనే సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ ఊరులోని ఓ కుటుంభంలోని పెద్ద కుమార్తె పౌర్ణమి (Trisha) అదే సంప్రదాయ నృత్యాన్ని చేయాలని శిక్షణ తీసుకుంటుంది. కానీ కథ అంతటితో ఆగిపోతుంది. ఆ తర్వాత, వెస్టర్న్ స్టైల్ డాన్స్ మాస్టరైన సివా కేశవ (Prabhas) ఆ గ్రామానికి వస్తాడు, పౌర్ణమి చిన్నచెల్లెలు చంద్రకళ (Charmme) తో పరిచయం ఏర్పడుతుంది. చంద్రకళకు నాట్యం అంటే అసలు ఇష్టం ఉండదు. అయితే, అప్పటికే సివా కేశవకు, పౌర్ణమికి మధ్య గతంలో ఒక విషయం జరుగుతుంది. ఆ విషయాన్నీ పౌర్ణమి చెల్లలు చంద్రకళ వద్ద రహస్యంగా ఉంచిన శివ కేశవకు ఒకరోజు ఆ రహస్యాన్ని బయటపెట్టాల్సిన సమయం వస్తుంది.. అసలు ఆ రహస్యం ఏంటి? పౌర్ణమికి, శివ కేశవకి సంబంధం ఏంటి? పౌర్ణమి ఎలా చనిపోతుంది? చివరికి వర్షాల కోసం పౌర్ణమి చెల్లెలు చంద్రకళ సంప్రదాయ నాట్యం చేస్తుందా లేదా..? అన్నది మిగిలిన కథ నడిచేటప్పుడు నృత్యం, ప్రేమ, కుటుంబ బంధాలు, పాతకాలం సాంప్రదాయాలు అన్నింటిని చూపిస్తూ సినిమాను చాల చక్కగా రూపొందించాడు దర్శకుడు.

తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ సినిమాను రీ  రిలీజ్ చేస్తుండడం విశేషం. అయితే, ఈ సినిమాను 19 ఏళ్ళ తర్వాత కూడా ఈ సినిమాను చూడవలసిన 5 ముఖ్య కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ పాత్ర... శివ కేశవ పాత్రలో ప్రభాస్ సింపుల్‌గా, నృత్యకళకి నిబద్దుడుగా, తనదైన శైలిలో ఈ పాత్రను పోషించాడు. ప్రభాస్, త్రిష కెమిస్ట్రి.. సినిమాలో వీరి సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పాటలు - ‘మువ్వల నవ్వకలా’ వంటి పాటలు ఇప్పటికీ క్లాసికల్ గా గుర్తుండిపోయాయి. చార్మీ కౌర్, రాహుల్ దేవ్, సింధు తులాని, ముకేశ్ రిషి, కోట శ్రీనివాస రావు లాంటి నటులు సినిమాకి హైలైట్ గా నిలిచారు. నృత్య సంప్రదాయాన్ని ఆధునిక డ్యాన్స్ స్టైల్‌తో కలిపి, ప్రత్యేక లొకేషన్లలో (హంపి, వైరుపక్ష మందిరం వంటి) చిత్రీకరించిన భాగాలు మరచిపోలేని విజువల్స్ ఇచ్చాయి.

ఎక్కువ యాక్షన్‑ఫ్యాక్షన్ కాకుండా, ‘Pournami’ ఒక నృత్యం, సంప్రదాయం, కుటుంబ బంధాలకూ ప్రాధాన్యం ఇస్తూ సినిమా చూసినవారిలో ఒక ప్రత్యేక భావన తీసుకొచ్చింది. 19 ఏళ్ళ తరువాత కూడా ఈ చిత్రం చెవులకు, కన్నులకు ఇంకా సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
మీరు ఇప్పటికీ ఈ సినిమా చూడకపోయి ఉంటే, ఈ రీ రిలీజ్ లో తప్పకుండ ఒకసారి చూసేయండి.

Advertisment
తాజా కథనాలు