Munna Re Release: జెన్ జీ టార్గెట్ గా వస్తున్న మున్నా..

ప్రభాస్ ‘మున్నా’ మార్చి 6న మళ్లీ రిలీజ్ అవుతోంది. 2007లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, యాక్షన్ సీన్లు, హారిస్ జయరాజ్ పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. జెన్ జీ యువత ఈ సినిమాపై ఆసక్తి గా ఉండడంతో ఈ సారి మంచి ఫలితం వస్తుందేమో చూడాలి.

New Update
Munna Re Release

Munna Re Release

Munna Re Release: ఇటీవల రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా ఊపందుకుంది. కానీ ఏ  సినిమా  హిట్ అవుతుందో ఏ సినిమా ప్లాప్ అవుతుందో చెప్పడం కష్టం అవుతోంది. గతంలో కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోయినా, ఇప్పుడు మాత్రం దాదాపు అన్ని సినిమాలు  మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మున్నా Munna మరోసారి థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ Prabhas హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 6న రీ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంతో దర్శకుడిగా వంశి పైడిపల్లి Vamshi Paidipally పరిచయం అయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు Dil Raju ఈ సినిమాను నిర్మించారు.

2007లో విడుదలైనప్పుడు ‘మున్నా’ భారీ అంచనాలతో వచ్చినా, బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. కథలో హీరో తండ్రే విలన్‌గా ఉండటం, అతన్ని ఎదిరించడం వంటి అంశాలు అప్పటి ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అయినా కూడా ప్రభాస్, ప్రకాష్ రాజ్ నటనకు మంచి పేరు వచ్చింది.

ఈ సినిమాలో కొన్ని స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే హారిస్ జయరాజ్ Harris Jayaraj అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అందుకే ఈ సినిమా మళ్లీ పెద్ద తెరపై చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. హీరోయిన్‌గా ఇలియానా Ileana D'Cruz నటించింది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో పాటు కాలేజీ సన్నివేశాలు కూడా సినిమాలో వినోదాన్ని అందిస్తాయి.

ఇప్పటి జెన్ జీ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా పాటల కోసం రీ రిలీజ్ సినిమాలను థియేటర్లలో సెలబ్రేట్ చేస్తున్న యువత, ‘మున్నా’కి కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వొచ్చు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మార్చి 6న పెద్దగా కొత్త సినిమాలు లేవు. అందువల్ల పోటీ తక్కువగా ఉండొచ్చు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం బాగా జరుగుతోంది. ఇదే విధంగా కొన్ని రీ రిలీజ్ సినిమాలు అనూహ్య విజయాన్ని సాధించినట్లు, ‘మున్నా’ కూడా సర్‌ప్రైజ్ హిట్ అవుతుందేమో చూడాలి. దాదాపు 19 సంవత్సరాల తర్వాత 2026లో మళ్లీ వస్తున్న ‘మున్నా’ ఈసారి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు