Prabhas Maruthi: ప్రభాస్‌ - మారుతి కాంబో మళ్ళీ రిపీట్..? ఫ్యాన్స్ కు పండగే!

ప్రభాస్‌-మారుతి మరో సినిమా చేస్తున్నారన్న వార్తలు కేవలం రూమర్స్ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభాస్‌ ‘స్పిరిట్‌’, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ ‘ఫౌజీ’లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

New Update
Prabhas Maruthi

Prabhas Maruthi

Prabhas Maruthi: ప్రభాస్‌ - మారుతి కాంబినేషన్‌పై ఇటీవల సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ‘ది రాజాసాబ్‌’ సినిమా పై మిక్స్డ్ టాక్ వచ్చినా, ప్రభాస్‌ మళ్లీ మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ భారీగా నిర్మించనుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ప్రభాస్‌ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలో మాఫియా నేపథ్యం కూడా ఉంటుందని, ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని సమాచారం.

ఇదే కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాలో కూడా ప్రభాస్‌ నటిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రానికి ప్రెజెంటర్స్‌గా ఉన్నారు.

‘ఫౌజీ’ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ ఉత్సాహంతోనే చిత్రబృందం ఈ సినిమాను దసరా పండుగకు థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. షూటింగ్ వేగంగా జరుగుతోందని, మధ్యలో పెద్ద గ్యాప్‌లు లేకుండా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, మంచి విజువల్స్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. ఇదే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. అలాగే అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు