/rtv/media/media_files/2026/02/16/prabhas-injury-2026-02-16-10-23-42.jpg)
Prabhas Injury
Prabhas Injury: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా సినిమా షూటింగ్ సమయంలో స్వల్ప గాయానికి గురైనట్లు సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న “ఫౌజీ” సినిమా(Fauzi Movie) షూటింగ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఒక యాక్షన్ సీన్ కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కింద పడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన చేతికి చిన్న మెలిక వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఫౌజీ' సెట్స్‌లో అపశ్రుతి: ప్రభాస్‌కు గాయం
— Journalist Scoop (@journalistscoop) February 16, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఫౌజీ' చిత్రీకరణలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక యాక్షన్ సన్నివేశం చేస్తున్న సమయంలో ప్రభాస్‌కు గాయం కావడంతో చిత్ర యూనిట్ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.#Prabhas#Fauzi#rebelstarpic.twitter.com/XviOCYxS2t
అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇది చాలా చిన్న గాయమే అని, పెద్ద ప్రమాదం ఏమీ కాలేదని దగ్గరి వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ల సలహా మేరకు ప్రభాస్ ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.
ఇటీవల “రాజా సాబ్” విడుదల సమయంలో ప్రభాస్‌పై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వచ్చాయి. కొన్ని పాటలు, యాక్షన్ సీన్లలో ఫేస్ స్వాప్ షాట్లు ఉన్నాయంటూ కొందరు కామెంట్లు చేశారు. దీంతో కొంతమంది అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ మరికొందరు మాత్రం అది టెక్నికల్ కారణాలు కావచ్చని, దర్శకుడి నిర్ణయం కావచ్చని అన్నారు.
ఇప్పుడు ఫౌజీ షూటింగ్‌లో ప్రభాస్ గాయపడిన వార్త బయటకు రావడంతో అభిమానులు ట్రోల్స్‌కు గట్టిగా సమాధానం ఇస్తున్నారు. ఇలాంటి రిస్కీ సీన్లు చేస్తున్నప్పుడు ఎంత శ్రమ పడుతారో తెలుసుకోండి అంటున్నారు. ఆయన తన పాత్ర కోసం ఎంత కష్టపడుతున్నారో ఇదే ఉదాహరణ అని చెబుతున్నారు.
ఫౌజీ సినిమా వివరాలు Fauzi Movie Details
“సీతారామం” ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
టి-సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.
షూటింగ్స్‌పైనే ప్రభాస్ ఫుల్ ఫోకస్
“బాహుబలి” సినిమా సమయంలో జరిగిన గాయాల వల్ల ప్రభాస్‌కు అప్పటి నుంచి కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయని తెలిసిందే. అయినప్పటికీ ఆయన యాక్షన్ పాత్రలు చేయడంలో వెనకడుగు వేయలేదు. ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన “ఫౌజీ”తో పాటు “స్పిరిట్” సినిమాలపై దృష్టి పెట్టారు. షూటింగ్స్ పూర్తి చేసిన తర్వాత కొంత విరామం తీసుకుని మళ్లీ బలంగా తిరిగి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి, ప్రభాస్‌కు అయిన గాయం చిన్నదే అని తెలుస్తోంది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆయన మళ్లీ సెట్స్‌లోకి వచ్చి షూటింగ్ కొనసాగించనున్నారు.
Follow Us