Prabhas Birthday: 'ఈశ్వర్' సినిమా టైంలో ప్రభాస్ ఏజ్ ఎంతో తెలుసా..?

ప్రభాస్ 2002లో 'ఈశ్వర్' సినిమాతో 23 ఏళ్ల వయసులో సినీప్రవేశం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయం సాధించకపోయినా, ఆయనకు గుర్తింపు తీసుకువచ్చింది. మంచి స్క్రీన్‌ ప్రెజెన్స్, నటనతో తొలి చిత్రంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

author-image
By Lok Prakash
New Update
Prabhas Eshwar Movie

Prabhas Eeswar Movie

Prabhas Birthday: తెలుగు సినీ ఇండస్ట్రీకి వరల్డ్‌ క్లాస్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, తన తొలి సినిమా "ఈశ్వర్"(Prabhas Eeswar Movie) ద్వారా 2002లో తెరంగేట్రం చేశారు. ఈ సినిమా విడుదలైనప్పటికీ పెద్దగా హిట్ కాకపోయినా, ప్రభాస్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

తొలి సినిమాలో ప్రభాస్ వయసు ఎంత?

ప్రభాస్ జన్మించింది అక్టోబర్ 23, 1979. ఇక “ఈశ్వర్” సినిమా విడుదల అయిన తేదీ నవంబర్ 11, 2002. అంటే ఆ సమయంలో ఆయన వయసు 23 సంవత్సరాలు. అలాంటి చిన్న వయసులోనే, ప్రభాస్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.

సినిమా కథ

ఈశ్వర్ అనే పాత్రలో ప్రభాస్ ఓ పేద కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడిగా కనిపిస్తారు. తల్లి లేని బాల్యం, గుడుంబా వ్యాపారంలో తండ్రితో కలిసి జీవనం గడిపే ఈశ్వర్, కాలేజీలో చదువుతున్న ఇందు (శ్రీదేవి విజయకుమార్) ను చూసి ప్రేమలో పడతాడు. మధ్యలో తన తండ్రి సుజాత (రేవతి) అనే మహిళను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈశ్వర్ తాన తండ్రి రెండవ పెళ్లి ఇష్టం తనను అమ్మగా అంగీకరించడు.

ఇందు తండ్రి స్థానిక ఎమ్మెల్యేగా ఉండి, పేదల్ని అసహ్యించుకుంటాడు. అలాంటిది ఎస్వీర్ తన కూతురిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఇందు తండ్రి ఏం చేసాడు..? ఇది ఈశ్వర్ జీవితంలో ఎలాంటి  మలుపు తీసుకుందో సినిమాలో చక్కగా చూపించారు.

ప్రభాస్ నటన

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త మాస్ హీరో పరిచయమయ్యాడు. ప్రభాస్ డైలాగ్ డెలివరీ, డాన్సులు, యాక్షన్ సీన్లు ఎంతో ఆకర్షించాయి. కొంతమంది సినీ విమర్శకులు ఆయన నటనలో కొన్ని ప్రముఖ బాలీవుడ్ నటుల మేనరిజమ్ ఉందన్నారు. అయినా, ఒక డెబ్యుట్ హీరోకి కావాల్సిన ఎనర్జీ ప్రభాస్‌లో ఉన్నట్లు ఈశ్వర్ సినిమాలో స్పష్టంగా కనిపించింది.

ఇక ఈ సినిమాకి సంగీతం అందించింది  ఆర్. పి. పట్నాయక్. ముఖ్యంగా "గుండెళ్లో వాలనా", "అమీర్ పెటా" వంటి పాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పదాలు పాటలకు ప్రత్యేకతనిచ్చాయి. జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

దర్శకుడు జయంత్ సి. పారణ్జీ ఈ సినిమాను కేవలం 45 రోజుల్లో పూర్తిచేశారు. శ్రీదేవి విజయకుమార్ (అభినేత్రి మంజుల కూతురు) ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగినా, సెకండ్ హాఫ్ లో మాస్ ఎలిమెంట్స్ బాగా పండాయి. ఈ సినిమా ఘన విజయం సాధించలేకపోయినా, ప్రభాస్ కెరీర్‌కు ఇది బలమైన పునాది వేసింది.

“ఈశ్వర్” ప్రభాస్ కెరీర్‌కు ఓ చిన్న ఆరంభం మాత్రమే. కానీ అదే ఆరంభం, ఆయన్ని బాహుబలి లాంటి గొప్ప స్థాయికి చేర్చింది. తొలిసినిమాలోనే ప్రభాస్ హైట్ (6'2"), మాస్ యాపీల్ చూసిన ప్రేక్షకులు, ఆయనలో స్టార్ హీరో మెటీరియల్ ఉందని అర్థం చేసుకున్నారు. తర్వాతి సినిమాలేవైనా, ఈశ్వర్ మాత్రం శాశ్వతంగా ఫ్యాన్స్ కి గుర్తుగా మిగిలిపోతుంది.

Advertisment
తాజా కథనాలు