ప్రభాస్- అనుష్క.. వీళ్లిద్దరి జోడీకి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే చాలా అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఆన్ స్క్రీన్ పై వీళ్ళ జోడీని చూసి తెగ మురిసిపోతుంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి సినిమా 'బిల్లా'. 2007 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రభాస్- అనుష్క కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.
'బిల్లా' తర్వాత 'మిర్చి' తో మరోసారి అభిమానులను మైమరిపించింది ఈ జంట. ఈ సినిమాలో ప్రభాస్- అనుష్క కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినీ ప్రియులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఈ మూవీలో 'కాటుక కళ్ళతో' సాంగ్ మరింత హైలైట్ అని చెప్పాలి.
ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన బాహుబలి నెక్స్ట్ లెవెల్. ఇందులో ప్రభాస్ తో సరిసమానంగా పోటీపడింది అనుష్క. లేడీ ప్రభాస్ అనేలా కనిపించింది. బాహుబలి తో వీళ్ళ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా 'ఓరోరి రాజా' సాంగ్ లో ప్రభాస్- అనుష్క ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా అనుకున్నారు నెటిజన్లు.
అనుష్క తో పాటు కాజల్ కూడా ప్రభాస్ కు బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీ అనిపించుకుంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన తొలి సినిమా 'డార్లింగ్' అభిమానులను ఫిదా చేసింది. ఇందులో ప్రభాస్ కాజల్ ను ప్రేమించిన తీరు అందరినీ ప్రేమలో పడేసింది. కాజల్- ప్రభాస్ కెమిస్ట్రీ కూడా బాగా నచ్చేసింది.
ఆ తర్వాత మళ్ళీ 2011 లో 'మిస్టర్ పర్ఫెక్ట్' తో ఈ కాంబో మరోసారి ఆన్ స్క్రీన్ పై సందడి చేసింది. రెండు వరుస హిట్లతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు.