/rtv/media/media_files/2025/03/13/xnrsU7cSzFqHnG2OefKS.jpg)
geetha krishna
డైరెక్టర్ గీతాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ఉమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. సినిమాల్లో నటించే మహిళలపై అసభ్యకరమైన విమర్శలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అశ్లీల పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.
సినిమాల్లో నటించే మహిళల పై అసభ్యకరమైన విమర్శలు చేస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టర్ గీతా కృష్ణ పై విశాఖ పట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఉమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ ఫిర్యాదును చేశారు. WWA సభ్యురాలు అనురాధ తెలిపిన వివరాల ప్రకారం... డైరెక్టర్ గీతాకృష్ణ విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో ఫిల్మ్ స్కూల్ రన్ చేస్తున్నారు.
అలాగే హైదరాబాద్ మాదాపూర్ లోనూ ఆయనకు మరో స్కూల్ ఉంది. అయితే ఇటీవలే వివిధ చానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వూలలో , సామాజిక మధ్యమాల్లో మహిళా నటులపై అసభ్యకర విమర్శలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘం సభ్యులు కె.ఎల్.డి.నాగశ్రీ, పి.పద్మాబాయి, బి.సుకన్య, కళావతి, రమాదేవి తదితరులు ఫిర్యాదును నమోదు చేశారు.