OG Day 1 Box office collections: : పవర్ స్టార్ బాక్సాఫీస్ ఊచకోత.. తొలి రోజే రూ.100 కోట్ల చేరువలో!

పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ముందు నుండి ఉన్న అంచనాలను అందుకుంటూ, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది.

New Update

OG Day 1 Box office collections: భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  ‘OG’ సినిమా బ్లాక్ బస్టర్  విజయాన్ని సాధించింది. సినిమా విడుదలకు ముందు నుంచి  ఉన్న అంచనాలను అందుకుంటూ, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని అందుకుని, రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. మొదటి రోజున, ‘They Call Him OG’ సినిమా అన్ని భాషలలో కలిపి భారతదేశంలో దాదాపు ₹70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. 

భారీ ఓపెనింగ్స్ 

అంతేకాకుండా, బుధవారం నాటి ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ₹20 కోట్లు కూడా కలుపుకుంటే, ఈ సినిమా మొత్తం వసూళ్లు భారతదేశంలో రూ. 90 కోట్లకు చేరుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సినిమా విడుదలైన మొదటి రోజు చాలా చోట్ల హౌస్‌ఫుల్ అయ్యాయి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఓజీ  ప్రభావం ఎక్కువగా ఉంది. పలు నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 25, 2025 గురువారం నాడు సినిమాకు 69.35% ఆక్యుపెన్సీ నమోదైంది. పవన్ కళ్యాణ్  నటన, మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లను అభిమానులు ప్రశంసించడంతో, సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. ఈ సినిమా వీకెండ్ అంతా ఇదే జోరును కొనసాగించే అవకాశం ఉంది. ఈ సినిమా ఇదే ఊపులో కొనసాగితే, 2025లో భారతీయ సినిమాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఓజీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం రూపొందించిన చిత్రమని అంటున్నారు.  కొత్త కథను ఆశించే వాళ్లకు కొంత నిరాశ కలిగించవచ్చని చెబుతున్నారు. సినిమాలో పవర్ స్టార్  స్టైల్, యాక్షన్, స్వాగ్ చూడాలనుకునే వాళ్లకు ఇది విజువల్ ట్రీట్ అని అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్, కొన్ని యాక్షన్ సీన్స్ థియేటర్ లో అభిమానులకు ఫుల్ కిక్కిచాయని తెలుస్తోంది.

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హాష్మీ, ప్రకాష్ రాజ్, కీలక పాత్రలు పోషించారు. డీవీవీ బ్యానర్ పై దానయ్య దీనిని నిర్మించారు. తమన్ సినిమాకు సంగీతం అందించారు. తమన్ బీజీఎం సినిమాలోని సన్నివేశాలను మరింత హైలైట్ చేసింది. పవన్ ఎంట్రీ సీన్లలో తమన్ బీజీఎం ఫ్యాన్స్ పూనకలు తెప్పించింది. అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చాలా కాలం తరవాత ఓజీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు పవన్. 

Advertisment
తాజా కథనాలు